తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలనే విధానంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ లో పాలన కొనసాగిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి వందరోజుల దాటినా..ఆయన ఇంతవరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. తన పని తాను చేసుకోపోతూ..ప్రభుత్వ నిర్ణయాలని మంత్రుల చేత మీడియా ముందు ప్రకటనలు చేయిస్తున్నారు. అందులోనూ మంత్రుల్లో బొత్స సత్యనారాయణ బాగా మీడియా ముందు  కనిపిస్తున్నారు. సీనియ‌ర్ కావ‌డంతో పాటు గ‌తంలో ప‌లుసార్లు మంత్రిగా ప‌నిచేయ‌డం... కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వంతో ఆయ‌న నోరు ఊరుకోవ‌డం లేదు. టీడీపీకి ఏదో ఒక కౌంట‌ర్ ఇచ్చేందుకే ఆరాట ప‌డుతున్నారు.


ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైన బొత్సనే మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తున్నారు. రాజధాని విషయం గానీ, బోటు ప్రమాదం గానీ, కోడెల ఆత్మహత్య గానీ..ఇలా ఎలాంటి విషయమైన బొత్సనే ముందు స్పందిస్తున్నారు. ఇక రాజధాని విషయంలో ముందు బొత్స చేసిన ప్రకటన వల్లే ఏపీ రాజకీయాల్లో దుమారం రేగింది. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రభుత్వంపై విమర్శల దాడి కూడా చేశాయి. మొత్తం మీద బొత్స సీఎం జగన్ తర్వాత ప్రభుత్వంలో నెంబర్2 గా వ్యవహరిస్తున్నారు.


ఇప్పుడు ఇదే విషయంపై సీఎం జగన్ బాగా విసుగుచెందినట్లు తెలుస్తోంది. ఆయన వల్లే రాజధాని విషయంలో ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ వచ్చిందని భావిస్తున్నారట. దీంతో ఆయన మాటలకు కళ్ళెం వేయాలని భావించిన జగన్...పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చేత బొత్సకు ఓ వార్నింగ్ కూడా ఇప్పించారట. అనసవరంగా నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని బొత్సపై విజయ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తం మీద అయితే బొత్సకు వార్నింగ్ త్వరగానే వచ్చేసింది. మరి ఇప్పటికైనా బొత్స దూకుడు తగ్గిస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: