అధికార వైసీపీ కంచుకోట జిల్లా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకున్నట్లుగా కనిపించడంలేదు. ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకొని టీడీపీ....ఫలితాలు వచ్చి మూడు నెలలు దాటినా..అడ్రెస్ లేదు. ఓటమి తర్వాత నాయకులు చెట్టుకొకరు,పుట్టకొకరు అయిపోవడంతో...పార్టీని నడిపించే నాథుడు కనపడట్లేదు. కొద్దోగొప్పో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కరే అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నారు తప్ప...మిగతా నేతలు మాత్రం అడ్రెస్ లేరు.


ముఖ్యంగా జిల్లాలో కీలక నేతలు బీదా బ్రదర్స్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీదా మస్తాన్ రావు మొన్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి తర్వాత మస్తాన్ యాక్టివ్ గా లేరు. అటు రవిచంద్రయాదవ్ కూడా కంటికి కనిపించడం లేదు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలని శాసించిన మాజీ మంత్రి నారాయణ...ప్రస్తుతం రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు.


మొన్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నారాయణ....సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. అయితే మరోవైపు ఈయన బీజేపీలోకి వెళ్లతారనే ప్రచారం జిల్లాలో జరుగుతుంది. అటు మాజీ ఎమ్మెల్యేలు పాశం సునిల్, బొలినేని కృష్ణయ్య, కె. రామకృష్ణ, బొలినేని రామారావు, శ్రీనివాసులురెడ్డిలు అయితే పార్టీ వైపు తొంగి చూడటం లేదు. నెల్లూరు రూరల్ నుంచి ఓడిపోయిన అబ్దుల్ అజీజ్ మాత్రం కొంచెం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


మొత్తం మీద ఈ జిల్లాలో టీడీపీ అసలు ఉందా అన్న అనుమానం వచ్చేలా నేతలు నడుస్తున్నారు. పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమాన్ని ఈ జిల్లా నేతలు విజయవంతం చేయడం లేదు. ఒక వైసీపీ ప్రభుత్వంపై అధినేత చంద్రబాబు...మరికొందరు నేతలు పోరాటం చేస్తున్న...నెల్లూరు నేతలు మాత్రం మనకెందుకులే అన్నట్లుగా ఉన్నారు. ఏది ఏమైనా నెల్లూరులో టీడీపీ ఇప్పటిలో యాక్టివ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: