తెలంగాణకి  సీఎంగా మరో పదేళ్లు నేనే ఉంటానని  కేసీఆర్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే మరో పదేళ్లు కాదు కదా.. ఈ సారే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని ఙప్ నేత ధర్మపురి అరవింద్ తెరాస ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్‌ను చంపుతుంటే కేసీఆర్ కళ్లారా చూడాలని...  అసలు  తెలంగాణకు కేసీఆరే శాపమని ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశాడు. ఈ బీజేపీ నేత వ్యాఖ్యలు చూస్తుంటే.. బీజేపీ తెలంగాణలో అధికారం కోసం బాగానే కసరత్తులు చేస్తోంది అనిపిస్తోంది.  దేశ వ్యాప్తంగా గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అఖండమైన విజయాన్ని నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. మొత్తానికి  రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి బీజేపీ ఇప్పటికే చాలా ప్రయత్నాలు మొదలెట్టింది.  ఈ క్రమంలోనే ఇతర పార్టీలనుండీ అసమ్మతిగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా  బీజేపీ తమ పార్టీలోకి కలిపేసుకుంటున్నారు. ఇంకా నాయకులను ఆహ్వానిస్తోన్నారు.  ఇప్పటికే  ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుండి అసమ్మతి నేతలందరినీ కూడా తన పార్టీలోకి లాక్కుంది బీజేపీ.  ఇప్పుడు బీజేపీ తెలంగాణ పై ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవలే పార్టీలో కీలకమైన నేతలు కూడా బీజేపీ లో చేరిపోదానికి సిద్ధమవుతున్నారట. 


ఈ క్రమంలోనే ఇటీవలే కొంతమంది నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసారట.  ఏమైనా తెలంగాణాల అధికారంలో ఉన్న తెరాస పార్టీ నుండి కూడా బీజేపీలో చేరిపోడానికి చాల మంది నేతలు  సిద్ధంగా ఉన్నారని..  ఇటీవలే ఓ బిజెపి నేత సంచలన వాఖ్యలు చేశారు.  ఏమైనా బీజేపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.  బీజేపీ వేసే ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్  కూడా సరికొత్త ప్రణాలికను సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యంగా నాయకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేలా ప్లాన్ చేశారట. అలాగే ప్రతి నెలలో కార్తకర్తల సమావేశాలు నిర్వహించాలని  కేసీఆర్ ఆదేశించారు. అలాగే  కేంద్రం నుండి కేసీఆర్ ప్రభుత్వానికి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో కేంద్రం అడ్డు తగులుతూనే ఉందని..   ఇప్పుడు ఈ  విషయాలనే  ప్రజలకు అర్ధమయ్యేలా,  బీజేపీ తెలంగాణకు నష్టం చేస్తోందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేశారట. మరి కేసీఆర్  ప్లాన్ తో ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.  ఏది ఏమైనా టీఆర్ఎస్‌ను చంపుతుంటే కేసీఆర్ కళ్లారా చూడాలని ధర్మపురి  అన్నట్లు..   టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?     


మరింత సమాచారం తెలుసుకోండి: