ఏపీ సీఎంగా జగన్ తనదైన పాలనను ప్రజలకు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్స్ పని చేస్తూ .. పక్కనే ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతూ పేషెంట్స్ ను ఇబ్బందికి గురి చేసేవారు. ఇప్పుడు దీని మీద జగన్ ద్రుష్టి సారించబోతున్నారు. డాక్టర్స్ కు జీతాలు పెంచి ప్రైవేట్ వైద్యానికి చెక్ పెట్టే దిశగా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే కమిటీ కూడా ఇదే విధంగా నివేదిక ఇచ్చింది. దీని ద్వారా రోగులకు లక్షల లక్షల డబ్బులు మిగిలే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే జగన్ వంద రోజుల పాలనా పై ఇప్పటీకే చాలా చాలా చర్చలు .. టీడీపీ విమర్శలు .. జనసేన వార్నింగ్ ఇవన్నీ మనం చూశాము. ప్రతి పక్షాల నుంచి ఇంత కంటే ఇంకేమి ఆశించలేము. కానీ జగన్ పాలన పట్ల ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం.


గత ప్రభుత్వం తన వెబ్ సైట్ నుంచి చివరికి మ్యానిఫెస్ట్ ను కూడా తొలిగించి ఘోరమైన పాలనను అందించింది. అందుకే ఆ పార్టీకి ప్రజలు తగిన బుధ్ధి చెప్పారు. చంద్రబాబును ఓడించాలనే కసితోనే ఓట్లు వేశారు. అయితే జగన్ తన వంద రోజుల పాలనలో ఇది తక్కువ సమయం అయినప్పటికీ జగన్ తన మ్యానిఫెస్ట్ అమలులో ఎంత నిబద్ధతతో ఉన్నారో జగన్  తీసుకున్న నిర్ణయాల బట్టి చెప్పొచ్చు. మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు.


మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు. ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. రాష్ట్రంలో   సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పట్టించుకోని పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రుల పని తీరు బాగా ఉందని జగన్ కు నివేదిక వచ్చిందటా ! 

మరింత సమాచారం తెలుసుకోండి: