హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ విషయంపై స్పందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణ భారత దేశంలో సాధ్యం కాని పని అని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు ప్రజలు, దక్షిణాదిలో హిందీని అంగీకరించరు. దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదే కావచ్చు. కానీ, మన దేశంలో ఒకే భాష లేదు కదా. ఉత్తర భారతీయులు కూడా ఒకే భాష విధానాన్ని అభినందించరు. కాబట్టి ఒకే భాషను బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు’ అని రజనీ అన్నారు.


ఇప్పటికే అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు దక్షిణాది భగ్గుమంటోంది. భారత దేశ భాష హిందీ కావాలన్న ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మండిపడ్డాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఇతర భాషలపై దాడి చేయడమేనని అన్నారు. మరోవైపు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ వాదం పేరుతో ఒకేమతం-ఒకే భాష తెరపైకి తెచ్చారని, తర్వాత ఏంటని తీవ్రంగా స్పందించారు.
రజినీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో తమిళరువి మానియన్ అనే రాజకీయ నేత ఆయన్ని సంప్రదించారు. చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లిన ఆయన త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.


సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ‘పిజ్జా’ ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డార్జిలింగ్‌లో ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. కాగా.. కొంత షూటింగ్‌ డెహ్ర‌డూన్‌లో జ‌రిగింది.ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న తొలిసారిగా సిమ్రాన్ న‌టిస్తున్న ఈ సినిమాలో.. వారిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: