తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ దివాకర రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హై కోర్ట్ నోటీసులు అందచేసింది. 2019 ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపి ఘోరంగా ఓడిపోయినా జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల అనంతరం వారసుల రాజకీయ భవిష్యేత్తు కోసం బీజేపీలోకి చేరుతారని వార్తలు భారీ ఎత్తున్న వచ్చాయి.             


అయితే ఎన్నికల అనంతరం అతను పార్టీ మారింది లేదు టీడీపీ గుడ్ బై చెప్పింది లేదు. ఇంకా విషయానికి వస్తే అక్రమ మైనింగ్‌ ఆరోపణల కేసులో జెసి దివాకర్‌రెడ్డి, త్రిశూల్‌ సిమెంట్స్‌ కంపెనీల భాగస్వాములు ఎస్‌.గోపాలరావు, టి.దేవపుత్రుడు, షేక్‌ హుస్సేన్‌, నాగ సుబ్బారాయుడు ఇతరులకు (బుధవారం)నిన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రారులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నోటీసులు ఇచ్చింది.               


 తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి 2011లో అనంతపురం జిల్లా యాకిడి మండలం కొనుప్పలపాడులోని సర్వే నెం 22 బిలోని 1605 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని వేసిన కేసులో భాగంగా నిన్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలోనే జేసీకి ఇతురులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.                                  


అప్పటి నుండి ఈ కేసు విచారణ జరుగకపోగా ఆ నోటీసులు అసలు జేసీ దివాకర్ రెడ్డికి చేరాయో లేదో అనే సందేహంతో మరోసారి నోటీసులను జారీ చేసింది ధర్మాసనం. కాగా ఈ కేసు విచారణ వచ్చే నెల అక్టోబర్ కి వాయిదా పడింది. మరి ఈ నోటీసులపై జేసి దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.                       



మరింత సమాచారం తెలుసుకోండి: