వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబు నటనకు జగన్ నాయకత్వానికి తేడాను చాలా క్లియర్ గా చెప్పారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు నటనని కళ్ళకు కట్టినట్టు చూపించారు విజయసాయి రెడ్డి.                


ఇంకా విషయానికి వస్తే .. విజయసాయి రెడ్డి సైరా పంచ్ అంటూ ట్విట్ చేశారు. ఆ పంచ్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. ''చంద్రబాబు నాయుడు మూడు నెలల క్రితం ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చి థ్యాంకు సీఎం సర్ అని రాయించుకున్న నటుడు చంద్రబాబు'' కానీ వైఎస్ జగన్ ఆలా కాదు.                                 


'ఎన్నికలైన మూడు నెలలకే ఆటో డ్రైవర్ల కోసం 400 కోట్లు ఇచ్చి హామీని నిలబెట్టుకుంటున్న నాయకుడు జగన్' అంటూ ఆ ఫోటో లో ఉంది. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ సీఎం వైఎస్ జగన్ కి, మాజీ సీఎం చంద్రబాబుకి ట్యాగ్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు 'చంద్రబాబు అంతేలే సర్'  చంద్రబాబు పెయిడ్ ఆర్టిసులు, పెయిడ్ ఆర్టికల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.                


మరింత సమాచారం తెలుసుకోండి: