మాములుగా ఎవరైన పుట్టినరోజును ఇంట్లో అందరు కలిపి జరుపుకుంటారు.  లేదంటే ఫ్రెండ్స్ మధ్యన జరుపుకుంటారు.  కొంచం సామాజిక దృక్పధం కలిగిన వ్యక్తులైతే.. ఓ అడుగు ముందుకేసి అనాధ శరణాలయంలో పండ్లు, పిల్లలకు పుస్తకాలు పంపిణి చేస్తుంటారు.  ఇక సెలెబ్రిటీల పుట్టినరోజులు ఎలా చేసుకుంటారో చెప్పక్కర్లేదు.  భారీ స్థాయిలో జరుపుకుంటారు.  డబ్బులకు కొదవ ఉండదు కాబట్టి ఎలాగైనా చేసుకుంటారు.

కానీ, డబ్బులేని వ్యక్తులు పుట్టినరోజు చేసుకోవడం మాట అలా ఉంచితే రోజువారీ తిండికోసం వెతుక్కునే పరిస్థితి వస్తుంది.  దాని నుంచి బయటపడటానికి ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.  అయితే, పుట్టినరోజున అందరికి ఉపయోగపడే పనులు చేస్తే.. ఆ పేరు చిరస్థాయిగా ఉంటుంది.  అదే పని చేశాడు గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి.  తన కొడుకు 19 వ పుట్టినరోజు సందర్భంగా ఓ తండ్రి తన గ్రామంలో వందమీటర్ల మేర రోడ్డుకు మరమ్మత్తులు చేయించాడు.  తన స్థోమతకు తగ్గట్టుగా మరమ్మత్తులు చేయించడంతో గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  


వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని మోర్బీ జిల్లాలోని రువాపర్ గ్రామం ఉన్నది.  ఆ గ్రామంలో నివసించే పరేష్ భాయ్ మొర్జా అనే వ్యక్తి తన కొడుకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని అనుకున్నాడు.  అయితే, అందరిలా కాకూండా అందరికి ఉపయోగపడేలా చేయాలని భావించాడు.  అనుకున్నట్టుగా పరేష్ భాయ్ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు రెండు ట్రాక్టర్లు తీసుకొచ్చి గ్రామంలో అద్వాన్నంగా ఉన్న రోడ్డును మరమ్మత్తులు చేయించాడు.  దాదాపు గ్రామంలోని 100 మీటర్ల మీద రోడ్డును బాగుంచేయించాడు.  


మొర్జా కుటుంబ సభ్యులు చేసిన ఈ మంచి పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అందరికి ఉపయోగపడే పని చేశారని మెచ్చుకున్నారు.  వర్షాల కారణంగా గ్రామంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి.  అధికారులకు మొరపెట్టుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  దీంతో మొర్జా రోడ్డును బాగుచేయయించడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.  అధికారులకు ఇది నిజంగా కనువిప్పు కలిగించే అంశంగా భావించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: