ప్రపంచంలో ఎన్నో వింతలు జారుతున్నాయి.  ఎవరికీ అంతుపట్టని విధంగా, నమ్మశక్యంగాని విధంగా కొన్ని విషయాలు జరుగుతుంటాయి.  చూడటానికి అంతా బాగున్నట్టుగానే అనిపిస్తుంది.  తీరా చూసే సరికి అక్కడ ఏదో జరిగిపోయి ఉంటుంది.  అలా జరగడం వలన ఇబ్బందులు వస్తుంటాయి.  కొన్నిసార్లు అక్కడ దెయ్యాలు భూతాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.  కానీ అనుకున్నా.. కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది. 

స్కాట్లాండ్లో ఓ అందమైన బ్రిడ్జ్ ఉన్నది. చూడటాన్ని అందరిని ఎట్రాక్ట్ చేస్తుంది.  చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో బ్రిడ్జి.. చుట్టూ పచ్చని వాతావరణం.  అక్కడికి వెళ్ళగానే అందరికి కాసేపు అక్కడ కూర్చోవాలని అని అనిపిస్తుంది.  ఓ గంట అక్కడ గడపాలని అనిపిస్తుంది.  కానీ, ఆ ప్లేస్ కు వెళ్ళగానే కుక్కలకు అమాంతం అక్కడి నుంచి దూకెయ్యాలని అనిపిస్తుందట.  అంతే.. ఆ బ్రిడ్జ్ చూడగానే అక్కడినుంచి దూకేస్తాయి. 

ఒకవేళ పొరపాటున దెబ్బలు తగిలితే.. తిరిగి పైకి వచ్చి మళ్ళీ దూకేస్తాయట.  ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం ఇప్పటి వరకు అంతుపట్టలేదు.  ఆంతా మాయగా ఉంది. ఎందుకు అలా జరుగుతుందనే విషయం ఇప్పటి వరకు తెలియడం లేదు.  మిస్టరీగా మారింది.  ఆ బ్రిడ్జ్ వరకు సక్రమంగానే వచ్చిన కుక్కలు.. అక్కడి రాగానే ఎందుకు దూకేస్తున్నాయో తెలియడం లేదు.  ఆ బ్రిడ్జ్ కి సూసైడ్ బ్రిడ్జి గా పేరు పడిపోయింది.  కేవలం కుక్కలు మాత్రమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయో అంతుచిక్కడం లేదు. ఆ బ్రిడ్జి దగ్గర దెయ్యాలు ఉన్నాయని, అవి కుక్కలను ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నాయని కొందరి అభిప్రాయం.  


ఇప్పటి వరకు దాదాపు 600 లకు పైగా కుక్కలు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాయట.  దీంతో అదొక మిస్టరీగా మారిపోయింది.  1960 వ సంవత్సరం నుంచి ఇలా జరుగుతున్నట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ బ్రిడ్జి పేరు ఓవర్టన్. 1859లో దీన్ని నిర్మించారు. 1950ల్లో ఇక్కడ ఓ కుక్క సూసైడ్ చేసుకోవడాన్ని తొలిసారి గుర్తించారు. 50 అడుగులు ఎత్తు ఉండే ఈ బ్రిడ్జి దగ్గరకు వచ్చే కుక్కలు ..ఒకే స్పాట్ దగ్గరి నుంచి కిందకు దూకినట్లు అక్కడి వ్యక్తులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: