రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ యుధ్ధ విమానం తేజస్ లో విహరించనున్నారు. బెంగళూరు ఎయిర్ వేస్ నుండి రాజ్ నాథ్ సింగ్ ఫ్లై కానున్నారు. తేజస్ లో విహరించిన తొలి రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ నిలవబోతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తేలికపాటి యుధ్ధ విమానం తేజస్ వాయుసేనలో చేరింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తరువాత ఈ యుధ్ధ విమానానికి సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్ ను అందజేయటం జరిగింది. 
 
గత ఫిబ్రవరిలో భారత స్టార్ షటిలర్ పీవీ సింధు తేజస్ లో విహరించారు. తేజస్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవటంతో పాటు ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. తేజస్ లో ఎలక్ట్రానిక్ యుధ్ధ సూట్లు, బాంబులు, ఆయుధాలు కూడా ఉంటాయి. ఈ యుధ్ధ విమానాన్ని స్వదేశీ పరిఙానంతో తయారు చేయటం విశేషం. 
 
ఈ యుధ్ధ విమానానికి మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అప్పట్లో తేజస్ అని నామకరణం చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో తేజస్సు అని అర్థం. తేజస్ యుధ్ధ విమానం రాకతో భారత రక్షణ రంగంలో స్వదేశీ యుధ్ధ విమానాలు ఉపయోగించాలనే చిరకాల స్వప్నం సాకరమైంది. తేజస్ రాకతో భారత రక్షణ రంగంలో కీలకమైన మైలురాయిని భారత వాయుసేన అధిగమించినట్లయింది. 
 
భారత ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితం యుధ్ధ విమానాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఈ విమానాలను సైన్యంలో ప్రవేశపెట్టటానికి 30 సంవత్సరాల సమయం పట్టింది. గడువు తీరిన మిగ్ యుధ్ధ విమానాల స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన జేఎఫ్ - 17 యుధ్ధ విమానం కంటే తేజస్ ఎన్నో రెట్లు ఉత్తమమైనదని అధికారులు చెప్పటం విశేషం. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: