గత ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయం సాధించింది.  ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.  తెరాస కు 60 నుంచి 70 వరకు వస్తాయని అనుకున్నారు.  అనూహ్యంగా తెరాస పార్టీ 88 సీట్లు గెలుచుకుంది.  ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని అనుకోలేదు. 2019లో ఎన్నికలు జరగాల్సి వచ్చినా.. 2018 లోనే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీకి ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం టీడీపీ అని చెప్పాలి.  టిడిపి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంతో..తెరాస పార్టీకి సీట్లు పెరిగాయి.  


ఇదిలా ఉంటె, ఎన్నికలు పూర్తయిన తరువాత, బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకుంది.  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది.  ఈ మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చాలామంది బీజేపీలో జాయిన్ అయ్యారు.  ఇది ఆ పార్టీకి కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలం పుంజుకొని అధికారం చేపట్టాలని చూస్తోంది.  


తెరాస పార్టీకి బీజేపీ చెక్ పెట్టాలని చూస్తుంటే.. అటు తెరాస పార్టీ బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నది.  బీజేపీకి మంచి పట్టున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి.  మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుంటాయి.  గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి విజయం సాధించిన తరువాత రెండు పార్టీలు ఏకమయ్యి అధికారంలోకి వచ్చాయి.  వచ్చే ఎన్నికల్లో శివసేన తిరిగి ఒంటరిగానే పోటీ చేయాలని చూసింది.  ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తే అధికారం చేపట్టాలని చూస్తున్నది.  


ఇదిలా ఉంటె కెసిఆర్ ఆధ్వర్యంలోని తెరాస పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.  మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తే కొద్దిమేర సీట్లు సాధించే అవకాశం ఉన్నది.  దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అనుకుంటోంది తెరాస.  ఇటీవలే మహారాష్ట్రకు చెందిన కొంతమంది నేతలు తెరాస పార్టీ నాయకులను కలిశారు. మహారాష్ట్రలో పోటీ చేయాలని అడిగారట.  కెసిఆర్ కూడా అందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: