ఈనెల 26 వ తేదీ నుంచి వరసగా బ్యాంక్ కు సెలవులు వస్తావున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. బ్యాంకులు సమ్మెకు దిగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు.  ప్రస్తుతం కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని, బ్యాంక్ సమ్మెకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, ఈనెల 25 వ తేదీ నాటికి ఈ విషయంపై ఒక కొలిక్కి వస్తుందని అధికారులు చెప్తున్నారు.  


ఒకవేళ సమ్మె జరిగితే ఈనెల 27, 27 సమ్మె, 28, 29 బ్యాంకు సెలవులు 30 వ తేదీన అర్ధసంవత్సరం కారణంగా సెలవు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  సమ్మె జరిగే సూచనలు చాలా వరకు ఉండవని, అవన్నీ అపోహలే అని అంటున్నారు.  సమ్మె జరగకపోతే 26, 27 తేదీల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.  28, 29 సెలవులు ఉంటాయి.  30 వ తేదీన కూడా బ్యాంకులు యధావిధిగా బ్యాంకు పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  


అక్టోబర్ 1 వ తేదీన బ్యాంకు పనిచేస్తుంది.  అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి జాతీయ సెలవు దినం కావడంతో బ్యాంకు పనిచేయవని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దని అంటున్నారు.  నెలాఖరు రోజుల్లో బ్యాంకులు పనిచేయకపోతే చాలామంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.  ఎందుకంటే నెలాఖరు నుంచి జీతాలు చెల్లింపులకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి.  


జీతాలు చెల్లింపుల విషయంలో సెప్టెంబర్ 25 నుంచి పనులు ప్రారంభం అయ్యి నెలాఖరు వరకు ముగుస్తుంది.  1 వ తేదీన జీతాలు పడతాయి.  ఒక్కరోజు ఆలస్యమైన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు.  ఇలాంటి బ్యాంకు సెలవులు వస్తున్నాయి అంటే పాపం ప్రజలు పడే ఇబ్బందులు అంతాఇంతా కాదు.  నెలాఖరు రోజుల్లో ఎవరిదగ్గర కూడా పైసా దొరకదు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: