కొన్ని రోజుల క్రితం గోదావరిలో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట బోరు కచ్చులురు వద్ద ప్రమాదానికి గురై మునిగిపోయింది.  ఈ ప్రమాదంలో 61 మందిలో 27 మంది సేఫ్ కాగా, మిగతా వాళ్ళు మరణించారు.  మరణించిన వారిలో 36 మృతదేహాలను బయటకు తీశారు. మరో 13 మృతదేశాలను వెలికి తీయాల్సి ఉన్నది.  ఈ 13 మృతదేహాల కోసం అన్వేషణ జరుగుతున్నది.  ముంబై నుంచి వచ్చిన మెరైన్ బృందం గోదావరిలో గాలింపు జరుపుతున్నది.  


అయితే గోదావరిలో పడవ ప్రమాదంపై అనేక రూమర్లు వస్తున్నాయి.  ఫిట్నెస్ లేని పడవలకు, డ్రైవింగ్ సరిగారాని వ్యక్తులకు ఎలా పడవ బాధ్యతలు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు.  అంతేకాదు, గోదావరికి వరదపోటు ఉన్నప్పుడు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.  టూరిజం ప్రాంతంలో పోలీసు, అధికారుల చేతివాటం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.  


అయితే, ఇలాంటి పెద్దస్థాయి పడవలు గోదావరిలోకి ప్రయాణం చేసే విషయం టూరిజం శాఖ మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.  తెలియకుండా ఎలా అనుమతులు ఇస్తారని అంటున్నారు.  అనుమతి లేకుండా పడవలు ప్రయాణం చేయలేవని, అంటున్నారు.  ఈ పడవ ప్రమాదం విషయంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.  


గతంలో గోదావరి కృష్ణాలోను ఇలాంటి బోటు ప్రమాదాలు జరిగాయి.  చంద్రబాబు హయాంలో జరిగినపుడు మంత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.  కానీ, గతంలో వైఎస్ అధికారంలో ఉండగా ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు మంత్రులపై కఠినమైన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.  మరి జగన్ తండ్రి బాటలో పయనించి అవంతిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.  ఒకవేళ చర్యలు తీసుకుంటే అవంతి శ్రీనివాస్ ను తప్పిస్తారా లేదంటే పక్కన ఉంచుతారా అన్నది తెలియాలి.  అవంతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. ప్రభుత్వంపై మచ్చ లేకుండా ఉండాలంటే ఇలాంటి చర్య తప్పని సరి అంటున్నారు కొందరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: