ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ జీవీయల్ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఉండాలనేది రాష్ర్ట ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌దే నిర్ణయమని, ఆ విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమని జీవీయల్ అన్నారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసిందని విమర్శించారు.

అప్పుడు గ్రాఫిక్స్..అందుకే జనాలు ఫిక్స్..రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారని జీవీయల్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. ఆ నిధులను రాయలసీమ అభివృద్ధికి ఖర్చు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శలు చేశారు. కేంద్రం నిధులకు లెక్కలు చెప్పమంటే టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని జీవీయల్ ఆరోపించారు.

ఆయన అలాంటోడు కాదు..ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఉదంతంపై జీవీయల్ స్పందించారు. కోడెల చాలా ధైర్యవంతుడని, ఆయన అలా ఆత్మహత్య చేసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. సీనియర్ నేత కోడెల మరణంపై రాజకీయాలు చేయడం తగదన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని జీవీయల్ కోరారు.అది వారి అపోహ మాత్రమే..ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను ఉద్దేశించి జీవీయల్ మాట్లాడుతూ బీజేపీలో చేరినంత మాత్రాన కేసులు మాఫీ అయిపోవన్నారు.

పార్టీలో చేరితే కేసులు మాఫీ చేస్తామని ఎవ్వరికీ హామీ ఏమీ ఇవ్వలేదన్నారు. కేసులకు, పార్టీలో చేరడానికి సంబంధం లేదన్నట్లు జీవీఎల్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఇప్పుడు అంతా బీజేపీ మంత్రమే దేశమంతా..


మరింత సమాచారం తెలుసుకోండి: