అధికార టీఆరెస్ మరోసారి అపరేషన్ ఆకర్ష్ కు చేపట్టనుందా?, ఇప్పటికే రాష్ట్రం లో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేసిన టీఆరెస్ నాయకత్వం... రాష్ట్రం లో బీజేపీ బలపడుతోందన్న సంకేతాల నేపధ్యం లో మరోసారి అపరేషన్ ఆకర్ష్ ద్వారా విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోందా ?? అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం విన్పిస్తోంది . రాష్ట్రం లో అధికార టీఆరెస్ , ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ , బీజేపీ , ఎం ఐ ఎం లకు మాత్రమే అసెంబ్లీ లో ప్రాతినిధ్యం ఉంది . కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే 12  మంది ఎమ్మెల్యేలు అధికార టీఆరెస్ లో చేరగా , ఇక మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాషాయ కండువా కప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు .


 అయితే తాజాగా ఆయన , ఆర్ధికమంత్రి హరీష్ రావు తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది . రాజగోపాల్ రెడ్డి కూడా టీఆరెస్ లో చేరనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి . కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే తాను హరీష్ ను కలిసినట్లు అనంతరం రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారనుకోండి ... అది వేరే విషయం . గురువారం  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హరీష్ ను కలువడం హాట్ టాఫిక్ గా మారింది . ఎందుకంటే వీరిద్దరూ ఇప్పటి వరకూ రాజకీయాల్లో ఉప్పు , నిప్పులాగా వ్యవహరిస్తూ వచ్చారు . హరీష్ పై జగ్గారెడ్డి దుమ్మెత్తిపోస్తే , జగ్గారెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారని హరీష్ విమర్శిస్తూ వచ్చారు . ఒక దశ లో జగ్గారెడ్డి , టీఆరెస్ లో చేరేందుకు రెడీ అయినా కేవలం హరీష్ అభ్యంతరం వల్లే ఆయన్ని చేర్చుకునేందుకు కేసీఆర్ విముఖత వ్యక్తం చేశారన్న వాదనలు కూడా లేకపోలేదు .


 ఈ నేపధ్యం లో 14  రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి హరీష్ , జగ్గారెడ్డి లు అరగంటపాటు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాదు ... మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు టీఆరెస్ స్కెచ్ వేస్తోందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో లేకపోలేదు .


మరింత సమాచారం తెలుసుకోండి:

trs