పువ్వుల ను పూజించే అపురూప సాంప్రదాయం మన తెలంగాణ ప్రజలది. పువ్వులను దేవతలుగా భావించి అన్ని పూలను ఒక చోట చేర్చి రంగులతో ముస్తాబు చేసి బతుకమ్మగా పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మను ఒక చోట పెట్టి చుట్టూ ఆటపాటలతో బతుకమ్మను చల్లగా చూడమ్మా అంటూ కొలుచుకుంటారు  తెలంగాణ ప్రజలు. అలాంటి బతుకమ్మ పండుగ ఇంకా ఎన్నో రోజులు లేదు. అయితే తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పండుగలకు సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ ఘనంగా   జరుపుతుంది. ఎన్నో కోట్లు వెచ్చించి బతుకమ్మ పండుగను కన్నుల పండుగ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 

 

 ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగకు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ కొత్త చీర కట్టుకోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా  కొన్ని రోజుల్లో బతుకమ్మ పండుగ రాబోతున్న నేపథ్యంలో తెరాస ప్రభుత్వం ప్రతి ఏడు లాగే ఈ  ఏడు కూడా బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ అనే బ్రాండ్స్ తో మార్కెట్లోకి చీరలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది అని తెలిపారు. 18 సంవత్సరాలు  నిండి  తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: