తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయనున్నారు..సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ గడించిన లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాపై గురువారం అసెంబ్లీలో ప్రకటిస్తామని ముఖక వివరించారు.

లాభాల్లో వాటాను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందని కార్మికులు ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు.సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి CMD శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. గతేడాది కార్మికులకు లాభాల్లో 27 శాతం వాటాను చెల్లించారు. కార్మిక సంఘాల నేతలు మంత్రులను కలిసి లాభాల వాటా ప్రకటించాలని కోరడంతో సీఎంకు వారు వివరించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.ముఖ్యమంత్రి దసరా కానుక..సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు.

సంస్థ లాభాల్లో 28 శాతం బోనస్‌ అందజేస్తామని ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. ఏటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందన్న కేసీఆర్.. కార్మికులు శ్రమించడమే దీనికి కారణమన్నారు. ఏటా సింగరేణిలో లాభాలు పెరుగుతున్నాయని.. అలాగే లాభాల్లో కార్మికులకు వాటా పెంచుతామన్నారు. 2017-18లో కార్మికులకు లాభాల్లో 27 శాతం వాటా ఇచ్చామన్న సీఎం.. ఈ ఏడాది 28 శాతం వాటా ఇస్తామన్నారు.

ప్రభుత్వం నిర్ణయంతో ప్రతి కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ అందనుంది. గత ఏడాది కంటే రూ.40,300 అధికంగా బోనస్ ఇస్తుండటం విశేషం. 2016లో రూ.54 వేలు, 2017లో రూ. 57 వేలు బోనస్‌గా ఇచ్చారు. శాలరీ అడ్వాన్స్‌లకు ఇది అదనం.సింగరేణికి కోట్ల లాభాలు వస్తున్నా..కార్మికుల జీతాలు మరియు జీవితాలు మాత్రం పెరగట్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: