మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిలో కోడెల చనిపోయాడనే బాధ ఏ మాత్రం లేకుండా రాజకీయ కోణంలో, రాజకీయ ఆలోచనలతో ఏదో సానుభూతి సంపాదించేద్దామనే ఒక తాపత్రయం మాత్రం కనిపిస్తుంది. చంద్రబాబు గవర్నర్ ను కలవటంలో ఆక్షేపణ లేదు. ఇదే వ్యక్తి గవర్నర్ వ్యవస్థను ఒక పనికిమాలిన వ్యవస్థ అని , ఏజెంట్ అని గతంలో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేస్తున్నాను. 
 
జగన్మోహన్ రెడ్డి గారిపై వైజాగ్ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు అప్పటి ఉమ్మడి గవర్నర్ ఫోన్ ద్వారా జగన్ ఎలా ఉన్నారో తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా విమర్శలు చేశాడు. గవర్నర్ గురించి చంద్రబాబు దళారీ అని, ఏజెంట్ అని కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అలాంటి వ్యక్తివి నువ్వు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ ను కలిసావని బొత్స ప్రశ్నించాడు. 
 
ఒక పనికిమాలిన వ్యవస్థ అన్న నువ్వు ఆ వ్యవస్థ దగ్గరకు ఎందుకు వెళ్లావని చంద్రబాబును బొత్స ప్రశ్నించాడు. గవర్నర్ ఎవరు అని అడిగిన నువ్వు ఎందుకు గవర్నర్ దగ్గరకు వెళ్లావని ప్రశ్నించాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక రకం అధికారంలో లేకపోతే ఇంకో రకం అని బొత్స అన్నాడు. ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం అని బొత్స అన్నాడు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదని చెప్పి ఇప్పుడు సీబీఐ రావాలని ఎందుకు కోరుకుంటున్నావని బొత్స చంద్రబాబును ప్రశ్నించాడు. 
 
కోడెలను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారని బొత్స ప్రశ్నించాడు. కోడెల మీద వచ్చిన కేసులు ప్రజలు పెట్టినవే తప్ప ప్రభుత్వం పెట్టినవి కాదని బొత్స అన్నారు. మీ పార్టీ చేసిన పనుల వలనే కోడెల మనస్తాపం చెందాడు. ఎల్లో మీడియా అంతా చంద్రబాబు ఆధీనంలో ఉందనే విషయం వాస్తవమా కాదా అని బొత్స చంద్రబాబును ప్రశ్నించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: