పీపీఏల ఒప్పందం విషయంలో జగన్ తీసుకుంటున్న స్టాండ్ ను ఇప్పుడు మిగతా రాష్ట్రాల సీఎంలు తీసుకోవటానికి సిద్ధం అయ్యారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చలాయిస్తున్నాయని మిగతా దక్షిణాది రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. జగన్ మాదిరిగానే పవన విద్యుత్ లో జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా కొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. అయితే ఏపీలో పీపీఏల ఒప్పందం సమీక్ష అంటే చాలు ఇటు కేంద్ర ప్రభుత్వం .. అటు ఏపీ ప్రతి పక్ష నేత చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. అక్రమాలు జరిగితే గాని రద్దు చేసే అవకాశం లేదని వాదిస్తుంది. అసలు అక్రమాలు జరిగాయో లేదో తెలియాలంటే ముందు సమీక్ష జరగాలి కదా ! దానికి మాత్రం కేంద్రం ఒప్పుకోవటం లేదు.


ఇలా జగన్ చేయాలనుకుంటున్న పీపీఏల సమీక్ష ఎటు తేలకుండా అలానే ఉంది. గత ప్రభుత్వం చేసిన అవినీతి నిర్వాహకం ఇప్పుడు ఏపీ ఆర్ధిక పరిస్థితిని కుదేలు చేస్తుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అప్పుల్లో నిల్చోబెట్టారు. దీనితో తరువాత అధికారం చేపట్టిన జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. పీపీఏల ఒప్పందం పారదర్శకంగా జరిగి ఉంటే రాష్ట్రం మీద ఇంత అప్పు ఉండేది కాదు. ఏపీ ప్రభుత్వం డిస్కం లకు 18,500 కోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర సుమారు రూ 5.50  పైగా కొనుగోలు చేయడంతో రాష్ట్రం మీద అప్పు కుప్పలుగా వచ్చి చేరింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో  రూ.2 నుంచి రూ. 3 ఉంటే .. ఏపీలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 


దీనితో జగన్ తప్పని పరిస్థితిలో పీపీఏల పునః సమీక్షకు పట్టు బడుతున్నారు. ఇదే మాదిరిగా విద్యుత్ ఒప్పందాలు ఉంటే ఇంకా చెల్లించే బకాయిలు పెరిగి పోతూనే ఉంటాయి. ఇదిఇలాగే కొనసాగితే  ఏపీ ఆర్ధిక పరిస్థితి కుప్ప కూలే పరిస్థితిలోకి వస్తుంది. అందుకే జగన్ తక్కువ ఖర్చుకే విద్యుత్ ను కొనుగోలు చేస్తే డబ్బులు మిగిలిపోతాయని .. లేకపోతే పెరిగిన బకాయిలు ప్రజల మీద విద్యుత్ చార్జీల రూపంలో మోపాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితిలో ప్రజల మీద విద్యుత్ భారం పడకూడదని .. జగన్ పీపీఏల సమీక్ష చేసి తక్కువకే  విద్యుత్ ను కొనుగోలు చేయాలనీ జగన్ నిర్ణయించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: