పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో చంద్రబాబుకు తొత్తుగా ఉండి .. ఆ పార్టీ ఇరకాటంలో ఉన్నప్పుడు బయటికి రావటంతో పవన్ కు ఉన్న కాస్తో కూస్తో ఇమేజ్ దెబ్బ తిన్నది. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోగానే .. జగన్ మీద ఎక్కడ లేని ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనితో సహజంగానే జనాల్లోకి పవన్  బాబు ఒకటేనని ఫీలింగ్ వచ్చింది. అలా వచ్చేలా చేసింది పవన్ గారే. ఆ పార్టీకి ఏదైనా అజెండా .. వ్యూహాలు ఇవన్నీ ఉన్నాయా .. అని సందేహం రాక మానదు. వైసీపీ 100 రోజుల పరిపాలనలో పవన్ మేధావి పెద్ద బుక్ ను ప్రచురించారు. టీడీపీ ఐదేళ్లలో నోరెత్తని ఈ మేధావి ఇప్పుడేదో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతున్నట్టు పచ్చ మాటలు మాట్లాడ్తున్నారు. జగన్ వంద రోజుల పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.


కానీ వీటిని మెచ్చుకునే నైజం పవన్ మేధావికి లేదు. క్లీన్ పాలిటిక్స్ అంటూ అందరి మాదిరిగానే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పదించి టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది. ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి.


జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. పవన్ కళ్యాణ్ ఎన్నికలో ఓడిపోవడానికి మరొక కారణం ..  పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: