టీడీపీ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని అందరికీ తెలిసిందే. ఆ పార్టీని నడిపే పరిస్థితిలో ఇప్పుడు బాబుగారు కూడా లేరని చెప్పాలి. అయితే లోకేష్ మీద ఆ పార్టీలో ఎవరికీ నమ్మకాలు లేవు. అయితే ఎన్టీఆర్ పార్టీలోకి రావాల్సిందేనని టీడీపీలో ఒక వర్గం గట్టిగా మాట్లాడుతుంది. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రానని ఎప్పుడు చెప్పలేదు. తన తాత స్థాపించిన పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని ఎన్టీఆర్ కు కూడా ఉంది. అయితే నారా లోకేష్ భవిష్యత్ నాయకుడంటే నేతలు భయపడే పరిస్థితి వస్తుంది. మొన్న పల్నాడు ఉద్యమంలో కూడా లోకేష్ నాయకత్వ లక్షణాలు చూసి టీడీపీ శ్రేణులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలు .. నేతలు పోలీసులతో గొడవపడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుళ్ళే దిశగా ఆలోచిస్తుంటే లోకేష్ మాత్రం నెమ్మదిగా ఒక చోట నిలబడి నలుగురిలో కలిసిపోయి ఉండటం చివరికి టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.


ఇతనేనా టీడీపీ భవిష్యత్ లీడర్ అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఉద్యమం అనగా ఒక మాట అనాలి .. నాలుగు మాటలు పడాలి .. ఏదోఒకటి చేస్తే గాని ప్రజల్లో మైలేజీ రాదు. కానీ అమూల్ బాయ్ అయినా లోకేష్ కు అవన్నీ తెలిసినట్టు లేదు. దీనితో లోకేష్ నిదానం చూసి టీడీపీ కార్యకర్తలు కూడా నోరెళ్లబెట్టడం మనం చూడొచ్చు. నారా లోకేష్ ఇన్ని రోజులు ట్విట్టర్లో రాజకీయాలు చేశారు. ఎక్కడ మీడియా ముందుకు వస్తే కామెడీ అయిపోతానమేనని లోకేష్ కు తెలుసు కాబట్టి ట్విట్టర్ లో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్ ను పార్టీ నాయకుడిగా ప్రాజెక్ట్ చేయడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు.


ఎన్నికలప్పుడు లోకేష్ బయటికి వచ్చి చేసిన కామెడీ షో ఇంకా అందరికి గుర్తున్నాయి. అయితే ఎన్నికలో ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ను చంద్రబాబు టీడీపీ లీడర్ గా ప్రాజెక్ట్ చేయడానికి .. ప్రజల్లోకి రుద్దడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడబోయి ఏం మాట్లాడతాడేమోనని టీడీపీ నాయకులూ కూడా జంకుతుంటారు. అయితే మొన్న మీడియా ముందు నోరు జారీ లోకేష్ బుక్ అయిన సంగతీ తెలిసిందే. అయితే లోకేష్ నోరు జారడం ఇది మొదటి సారి కాదు.  కృష్ణా నదిలో వరదలు వస్తే కావాలని వైసీపీ తమ ఇంటి మీదకు వరద నీటిని పంపించిందని చెప్పి ప్రజల్లో అభాసుపాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: