రాజకీయాల్లో అదృష్టం కలిసొస్తే చిన్న నాయకుడుకి కూడా పెద్ద పదవి దక్కుతుందని చెప్పడానికి ఉదాహరణగా ఏపీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ నిలుస్తున్నారనే చెప్పొచ్చు. మొన్న ఎన్నికల్లో తొలిసారి అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణకు జగన్ మంత్రివర్గంలో చోటు ఇచ్చేశారు. జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్న బీసీ సామాజికవర్గం కోటా కింద నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టేశారు.


అయిదుసార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డి లాంటి సీనియర్ నేతలని సైతం పక్కకునెట్టి మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ ఈ మూడు నెలల పరిపాలన కాలంలో పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి.  తొలిసారి ఎమ్మెల్యే కావడం, ఆ వెంటనే మంత్రి కావడంతో అనుభవలేమీ కొట్టచ్చిన్నట్లు కనబడుతుంది. జూనియర్ మంత్రి కావడంతో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు పూర్తిగా డామినేట్ చేస్తూ...మంత్రిని అసలు లెక్క చేయడంలేదు. పైగా వీరికి దక్కకుండా నారాయణకు రావడం పట్ల రెడ్డి ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.


ఆ ఎమ్మెల్యేలు చేసే పనులకు తగ్గట్టుగా మంత్రికి రాజకీయాలు కొత్త కావడం వల్ల దూకుడుగా ముందుగా వెళ్లలేకపోతున్నారు. అటు శాఖపై పట్టు సాధించలేకపోయారు. ఫ్యాక్షన్ ప్రభావం గల పెనుగొండ ఎమ్మెల్యేగా కూడా ప్రభావం చూపట్లేదు. ఏదో జగన్ గాలిలో గెలిచారు తప్ప..ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదు. ఈ మూడు నెలల కాలంలో అటు మంత్రిగా, ఇటు ఎమ్మెల్యేగా రాణించలేదనే చెప్పాలి. జిల్లాలో ఏకైక మంత్రిగా మిగతా నేతలని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడంలో విఫలమయ్యారు.


ఇక సీనియర్ ఎమ్మెల్యేలు అయితే మంత్రిని పూర్తిగా లైట్ తీసుకున్నారు. మంత్రి పదవి ఉన్న అసలు లెక్క చేయట్లేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రి హోదాలో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నా ఎమ్మెల్యేలు అటెండ్ కూడా అవ్వ‌డం లేదు. దీంతో ఇది పార్టీలో పెద్ద ర‌చ్చ‌కు దారితీసేలా ఉంది. మొత్తం మీద మంత్రి నారాయణ రాజకీయ రేసులో పూర్తిగా వెనుకబడిపోయారనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: