తాను చేస్తే సంసారం.. ఒక‌రు చేస్తే వ్య‌భిచారమ‌ట‌.. అందుకే చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఏది చేసినా అది స‌క్ర‌మ‌మే.. అదే ఇప్పుడున్న పాలకులు చేస్తే మాత్రం అది అక్ర‌మ‌మ‌ట‌.. ఇదేమి చిత్ర‌మో కానీ చంద్రబాబు నాయుడుకు నేనే మోనార్క్‌ను న‌న్నేవ‌రు మోసం చేయ‌లేరు అనుకుంటాడు.. ఏ మోసం చేయాల‌న్నా అందులో ఆరితేరిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న చూసి బెంబేలెత్తిపోతున్నాడు. 


అందుకే జ‌గ‌న్ 100 రోజ‌లు పాల‌న చూసి వెన్నుపోటు బాబుకు వెన్నులో వ‌ణుకు పుడుతున్న‌ట్లు ఉంది. అందుకే జ‌గ‌న్ పాల‌న రాక్ష‌స పాల‌న‌, నియంత పాల‌న అంటూ అవాకులు చ‌వాకులు పేలుతున్నాడు. ఇంత‌కు జ‌గ‌న్ చేసిన అంత మోస‌పూరిత‌మైన పాల‌నేంటి.. అస‌లు చంద్రబాబుకు క‌నిపించిన నియంత పాల‌నేంటి అనేది ఏపీలోని సామాన్య ప్ర‌జ‌లే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసే ప‌రిస్థితి తెచ్చుకుంటున్నాడు.


అస‌లు చంద్ర‌బాబు పాల‌న‌కు, జ‌గ‌న్ పాల‌న‌కు వ్య‌త్యాసం ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. మ‌రి ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌ను అస్య‌హించుకోక‌ముందే ఎందుకు బాబోరు ఎందుకు అస‌హానం వ్య‌క్తం చేస్తున్నారు..చంద్రబాబు కు సీఎంగా, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నంత అనుభ‌వం జ‌గ‌న్‌కు లేదు అనేది వాస్త‌వం. సీఎం వైఎస్ జ‌గ‌న్‌కే కాదు దేశంలో మ‌రే నేత‌కు లేద‌నేది స‌త్య‌మే. మ‌రి అలాంటి అనుభ‌వం ఉన్న నేత‌గా, సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు ఎందుకు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.. చంద్ర‌బాబును ఎందుకు ప్ర‌తిప‌క్ష నేత‌గానే ప్ర‌జ‌లు ప‌రిమితం చేశారు. అస‌లు చంద్ర‌బాబుకు ఉన్నంత అనుభ‌వం లేని జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఎందుకు ప‌ట్టం క‌ట్టారు. అస‌లు జ‌గ‌న్‌ను న‌మ్మిన జ‌నాలు బాబోరు ఎందుకు న‌మ్మ‌లేక పోయారు.. అంటే చంద్ర‌బాబు చేసిన క‌ప‌ట వాగ్ధానాలు న‌మ్మి మోస‌పోయిన జ‌నం మ‌రోమారు మోస‌పోయేందుకు సిద్దంగా లేరు అందుకే బాబును ఓడించార‌నేది వాస్త‌వ‌మే.


చంద్రబాబు జ‌గ‌న్ పాల‌న‌పై 100రోజుల్లోనే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న‌వుతున్నార‌నేది వాస్త‌వాన్ని గ్ర‌హించ‌క‌పోవ‌డం విడ్డూర‌మే. అస‌లు 100రోజుల్లో ఎవ‌రైనా ప‌రిపాల‌న గాడిలో పెట్ట‌డం సాధ్య‌మేనా.. ఇది ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా, అనుభ‌వం ఉన్న సీఎంగా చంద్రబాబుకు తెలియ‌దా...?  అనుభ‌వం లేని జ‌గ‌న్ కేవ‌లం 100 రోజుల్లో క‌నివిని ఎరుగ‌ని రీతిలో పాల‌న చేసిండంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు. చంద్ర‌బాబు ఐదేండ్లు పాల‌న చేసి క‌నీసం ఏపీకి రాజ‌ధానిని నిర్మించ‌లేక పోయాడు. అది భూత‌ల స్వ‌ర్గం అంటూ ఊరించ‌డ‌మే త‌ప్ప చేసింది శూన్యం అని తెలిసి కూడా ఎందుకు  రాద్దాంతం చేస్తున్న‌ట్లు.  


ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా పేరు చెప్పి ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుని మ‌ళ్ళీ ఓట్లు రాగానే ప్ర‌త్యేక హోదా పేరుతో ఆడిన డ్రామా జ‌నాల‌కు తెలియ‌దా..? ఆయ‌న విశ్వ‌స‌నీయత దీంతో దెబ్బ తిన‌లేదా..? ఇక బీజేపీ పాల‌న‌లో కేంద్రంలో కేబీనెట్ మంత్రులుగా చెలామ‌ణి అయిన బాబు గారి ఆత్మ‌లు కేవ‌లం అధికారం కోస‌మే బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌దే స‌రైన‌దా..? ఇది రాజ‌కీయ వ్య‌భిచారం కింద‌కు రాదా..? మ‌రి ఇక ఏపీలో ఉద్యోగాల జాత‌ర అన్న చంద్రబాబు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వ‌లేదు.. ఇది చంద్ర‌బాబు పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా.. ? 


ఇక ఏపీలో త‌న ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుక పేరుతో నిలువుదోపిడి చేసినా, ఓ మ‌హిళా ఎమ్మార్వోను దూషించి, దాడి చేసినా నోరు మెద‌ప‌ని చంద్ర‌బాబు ప‌రిపాల‌న నియంత పాల‌న కాదా..? ఇది ఆరాచ‌క పాల‌న కిందికి రాదా..? ఆయ‌న పార్టీ ఎంపీలు ఓ ర‌వాణా శాఖ ఉన్నతాధికారిపై దాడి చేసినా, పోలీసుల‌పై ఆరాచ‌కం చేసినా ఇది నియంతృత్వ పోక‌డ కింది రాదా..?  దుష్ట పాల‌న కిందికి రాదా..?  ఇది చంద్ర‌బాబు ఆరాచ‌క పాల‌న కు నిద‌ర్శ‌నం కాదా..?


ఇక పుష్క‌రాల పేరుతో సినిమా షూటింగ్‌ల‌కు, ఫోటోల‌కు ఫోజులిచ్చిన స‌మ‌యంలో భ‌క్తులు చ‌నిపోయిన‌ప్పుడు తాను చేసిన త‌ప్పులు చంద్ర‌బాబుకు గుర్తుకు రాలేదా..? ఇవి త‌న ప‌రిపాల‌న‌లో జ‌రిగిన దుష్ట‌పాల‌న కాదా..?   ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఎమ్మెల్యేల‌ను సంత‌ల్లో ప‌శువుల్లా కొనుగోలు చేసి, వారికి మంత్రి ప‌దవులు ఇచ్చిన చంద్ర‌బాబు చేసింది నైతిక పాల‌న కింద‌కే వ‌స్తుందా..?  ఇది రాజ‌కీయ వ్య‌భిచారం కింద‌కు రాదా...?  నోటుకు ఓటు పేరుతో తెలంగాణ స‌ర్కారుకు అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్య‌వ‌హారంతో ఏపీ ప్ర‌జ‌ల ప‌రువు తీసింది నిజం కాదా...? ఇది కూడా చంద్ర‌బాబు నైతిక‌త‌కు నిద‌ర్శ‌నం కాదా..?


వీటికి తోడు ఇంకా అనేక  అనైతిక‌, ఆరాచ‌క‌, నియంతృత్వ‌, రాక్ష‌స పాల‌న చేసిన చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకుని కేవ‌లం 100 రోజుల పాల‌నే రాక్ష‌సంగా ఎలా క‌నిపిస్తుంది. నియంతృత్వ పోక‌డ‌లు ఎక్క‌డ గోచ‌రిస్తున్నాయి.. ఎక్క‌డ  అక్ర‌మాలు క‌నిపిస్తున్నాయి... అంటే చంద్ర‌బాబు త‌ట్టుకోలేని జీర్ణించుకోలేని వాస్త‌వాలు ఏంటంటే.. గ్రామ స‌చివాలయం పేరుతో 1.30ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే జ‌గ‌న్ చేసిన త‌ప్పా..?  ఇసుక పేరుతో దోపిడి లేకుండా చేసేందుకు కొత్త ఇసుక పాల‌సీ తీసుకురావ‌డ‌మే జ‌గ‌న్ చేసిన మోస‌మా...?  ఆశ వ‌ర్క‌ర్ల‌తో, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌తో వెట్టిచాకిరి చేయించుకున్న చంద్ర‌బాబు జ‌గ‌న్ వారికి వేత‌నాలు పెంచ‌డ‌మే ఆయ‌న చేసిన త‌ప్పా..?  


సీఎంగా నేనే గొప్ప అని చెప్పే చంద్రబాబు ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌కుండా, కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించ‌క‌పోతే అది జ‌గ‌న్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసి, ఉద్యోగుల‌ను స‌ర్కారు ఉద్యోగులుగా గుర్తించి వారి కుటుంబాల్లో వెలుగులు నింప‌డ‌మే  నేర‌మా..?  బోటు ప్ర‌మాదంలో అధికారులు నిర్ల‌క్ష్యానికి ప‌దులు సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు జ‌ల‌స‌మాధి అయిపోతే ఇది ప్రభుత్వ అధికారుల నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నం అని త‌ప్పును నిర్భ‌యంగా ఒప్పుకోవ‌డ‌మే జ‌గ‌న్ చేసిన పొర‌పాటా...? చ‌ంద్ర‌బాబు పాల‌న‌లో త‌న స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌ప్పులు చేస్తుంటే సొంత‌పార్టీ నాయ‌కులు పిర్యాదు చేసినా ప‌ట్టించుకోని చంద్రాలు.. అధికారం పోగానే టీడీపీ కార్య‌క‌ర్త‌లే కేసులు పెడితే అవి ప్ర‌భుత్వమే కేసులు  పెట్టింద‌ని, కోడెల‌ను ప్ర‌భుత్వం వేధిస్తేనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని శ‌వ‌రాజ‌కీయాల‌కు తెర‌లేపిన చంద్ర‌బాబుకు కోడెల చేసిన త‌ప్పులు క‌నిపించ‌డం లేదా...?  


మేము ఏ త‌ప్పులు చేసినా మీరు చూసి చూడ‌న‌ట్లు గ‌ప్‌చిప్‌గా ఉండాల‌ని, లేకుంటే కోడెల లాగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డ‌మే ఆయ‌న‌కు తెలిసిన రాజ‌కీయ‌మా...?  అంటే రాజ‌ధాని భూములు దోచుకున్నా, పోల‌వ‌రం నిధులు అప్ప‌నంగా మింగినా.. స‌దావ‌ర్తి భూములు అగ్గువ‌కు దొబ్బినా అది మీ ఘ‌న‌తే అయినా జ‌గ‌న్ చూసీ చూడ‌న‌ట్లు ఉండాల‌న్న‌ట్లా..?  జ‌గ‌న్ వాటిపై విచార‌ణ‌లు చేయ‌వద్ద‌న్న‌ట్లా...? ప‌్ర‌జా సొమ్మును దోచుకుంటే ఎవ‌రిని వ‌ద‌లొద్దు అని అవినీతి స‌హించొద్దు అని జ‌గ‌న్ అంటుంటే.. మేము అవినీతే చేస్తాము.. చేశాము.. మీరు మాత్రం ఏమి అనొద్దు అని కోడెల శ‌వ‌రాజ‌కీయం చూస్తుంటే ఏపీ ప్ర‌జ‌లే చంద్రాలును అస్య‌హించుకుంటున్నార‌నే స‌త్యం గ్ర‌హించ‌క‌పోవ‌డం విడ్డూర‌మే మ‌రి.


ఇక చివ‌రికిగా వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను సంత‌ల్లో  ప‌శువుల్లా కొని మంత్రి ప‌దవులు ఇచ్చిన‌ప్పుడు చంద్ర‌బాబుకు క‌నిపించిని నైతిక‌త‌, ఏ పార్టీలో గెలిచిన‌వారైనా పార్టీ మారితే త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేసి రావాల‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డ‌మే అనైతికం అయిందా చంద్రాలు.. ఇంకా జ‌గ‌న్ కేవ‌లం 100రోజుల్లోనే అనేక ప‌నులు చేసి చంద్రాలుకు దిమ్మ‌తిరిగేలా చేస్తుంటే అనైతికంగా క‌నిపిస్తున్నాయి...


వెన్నుపోటు రాజ‌కీయాల‌కు నెలువైన చంద్రాలుకు జ‌గ‌న్ చేసిన ప‌నుల‌న్ని అనైతికం, ఆరాచ‌కంగా, అక్ర‌మంగా, దుర్మార్గంగా, నియంత పాల‌న‌గా, దుష్ట పాల‌న‌గానే క‌నిపిస్తుంది. ఎందుకంటే ఇవ‌న్ని తాను చేయ‌లేదు క‌నుక ఇంకా ఎవ‌రు చేయ‌డం త‌ను త‌ట్టుకోలేడు క‌నుక‌. అందుకే జ‌గ‌న్ కేవ‌లం 100రోజుల్లోనే ఇంత జ‌న‌రంజ‌క‌మైన పాల‌న చేస్తుంటే చంద్రాలుకు క‌డుపు మండిపోతున్న‌ట్లు ఉంది. ఏందీ ఈ పిల్ల‌గాడు.. నా అనుభ‌వం అంతా వ‌య‌స్సులేని వాడు నాక‌న్నా ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో, సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతుంటే.. భ‌విష్య‌త్‌తో నా మాట వినేవాడు ఎవ్వ‌రు.. నాకు ఓట్లేసేవారు మిగ‌ల‌రు..నాకు సీఎం ప‌ద‌వి అంద‌ని అంద‌కుండా పోతుంద‌నే అభ‌ద్ర‌తా భావంతోనే అస‌హానంతో ఊగిపోతున్నాడ‌ని ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే గుర్తించారు.


చంద్రబాబుకు వెన్నుపోటు రాజ‌కీయాలు వెన్న‌తో పెట్టిన విద్య.. ఇది సుస్ప‌ష్టం.. ఎందుకంటే పాపం కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఓడిపోయి మూడు నెల‌లు అవుతున్నా క‌నీసం క‌నిక‌రం లేకుండా, త‌న ఆత్మ అయిన వ‌ర్ల రామ‌య్య‌తో కోడెల‌ను దూషించేలా మాట్లాడించిన చంద్ర‌బాబు, మ‌న‌స్థాపంతో కోడెలు ఆత్మ‌హ‌త్య చేసుకునే ద‌శ‌కు చేర్చిన చంద్ర‌బాబు ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కార్చుతూ.. శ‌వ రాజ‌కీయాలు చేయ‌డంతో ఆయ‌న నైజం బ‌య‌ట ప‌డిందనే చెప్ప‌వ‌చ్చు.


చంద్ర‌బాబు నాయుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించేలా సీబీఐ చేత విచార‌ణ పేరుతో ఏడాదిన్న‌ర‌కు పైగా జైల్లో బంధించిన‌ప్పుడు నైతికంగా అనిపించిన వ్య‌వ‌హారం తాను మాత్రం అక్ర‌మాల కేసుల‌ను అణ‌గ‌దొక్కించుకున్న‌ప్పుడు మాత్రం ఎలా  నైతికంగా తోచింది బాబోరు... అందుకే చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రం ఎట్లుందంటే.. సంసారి సందులో ఉంటే.. వ్య‌భిచారి ఊరంతా ఊరేగింద‌ట‌.. అన్న‌ట్లుగా ఉంది బాబుగారి భాగోతం. ఇక‌నైనా చంద్రబాబు నాయుడు తాను చేసే ఈ శ‌వ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి ఉన్న కాస్త ప‌రువైనా కాపాడుకోవాల‌ని ఏపీ ప్ర‌జ‌లు హితువు ప‌లుకుతున్నారు...



మరింత సమాచారం తెలుసుకోండి: