ఒకప్పుడు యుద్దాలు జరగడం అంటే రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి జరిగేవి.  ఆ యుద్ధాల్లో సైనికులు మాత్రమే మరణించేవారు.  సామాన్యులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.  ఏ రాజు బలవంతుడో, ఏ రాజు వ్యూహాలను అద్భుతంగా అమలు చేస్తాడో.. ఏ రాజు తన బలగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతాడో ఆ రాజు విజయం సాధిస్తాడు.  అది ఒకప్పటి మాట.  ఇప్పుడు అలాకాదు.  


మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలయ్యి 1918 వరకు సాగింది.  అంటే దాదాపు నాలుగుదేళ్లు యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంలో వేలాదిమంది సైనికులు మరణించారు. అది మామూలే.  అయితే, 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచయుద్ధం 1945 వరకు కొనసాగింది.  దాదాపు ఆరేళ్లపాటు యుధం జరిగింది.  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బలమైన ఆయుధ వ్యవస్థ కలిగి ఉండటంతో చాలా దేశాల్లో విద్వాంసం జరిగింది.  అలా విధ్వంసం జరిగి చరిత్రలో ఎన్నో ఇబ్బందులు పడిన నగరాలు హిరోషిమా, నాగసాకి.  


ఈ రెండు నగరాల్లో అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబులు వేసింది.  దాని ఫలితంగా వేలాదిమంది మరణించారు.  లక్షలాది మంది క్షతగ్రాత్రులయ్యారు. హిరోషిమా నాగసాకిలో చాలా ఏళ్లపాటు గడ్డిమొక్క కూడా మొలవలేదు.  ఆ తరువాత మరలా ఎప్పుడు అణుబాంబులు ప్రయోగించలేదు.  తయారు చేసిన ఆయుధాలను భద్రపరుచుకుంటున్నారు.  భవిష్యత్తులో యుద్ధం జరిగినపుడు వాటిని బయటకు తీయాలనే ఆలోచనలో ఉన్నది.  


అయితే, ప్రసుత్తం ఉన్న పరిస్థితుల్లో అమెరికా, రష్యా దేశాల చాలా బలమైన దేశాలు.  రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్న దేశాలు.  ఈ దేశాల మధ్య గొడ్డువ జరిగి అణుయుద్ధం సంభవిస్తే.. గంటల వ్యవధిలోనే రెండు దేశాల్లోని 4 కోట్లమంది ప్రజలు మరణిస్తారు.  ఇది ప్రాధమిక అంచనా మాత్రమే. అమెరికా, రష్యా దేశాల్లోని ప్రధాన నగరాలూ అణుబాంబు ధాటికి కుప్పకూలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  లక్షలాది మంది గాయాలబారిన పడతారని విశ్లేషకులు 


మరింత సమాచారం తెలుసుకోండి: