పీపీఏల ఒప్పందంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని మిగతా దక్షిణాది రాష్ట్ర్లాలు కూడా ఫాలో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ నిర్ణయం పట్ల కేంద్రం చాలా అసహనంగా ఉంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల అధినేతలు కూడా జగన్ మాదిరిగానే పీపీఏల పునః సమీక్షకు పట్టుబడితే కేంద్రానికి చిక్కులు తప్పవు. అలాగే పోలవరం విషయంలో కూడా జగన్ .. కంద్రాన్ని లెక్క చేయలేదు. పోలవరం విషయంలో జగన్ వైఖరి పట్ల కేంద్రం ఆసక్తికరంగా స్పందిస్తుంది. దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నా జగన్ లాంటి మొండి వైఖరి ఉన్న సీఎం ను చూడలేదని .. జగన్ ఎవరి మాట వినే  రకం కాదని వ్యాఖ్యానిస్తునట్టు సమాచారం. నిజానికి కేంద్రంలో బీజేపీ బలమైన పార్టీ .. పైగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి వేరే సీఎం అయితే కేంద్రం చెప్పినట్టు చేసి ఉండే వారు. కానీ అలా వింటే జగన్ ఎందుకు అవుతారు.


కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీనే లెక్క చేయలేదు. ఇక బీజేపీని ఏం లెక్కచేస్తాడని మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. పోలవరంలో విషయంలో నవయుగ కంపెనీకి ఉద్వాసన పలుకుతూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక పక్క హై కోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా జగన్ తాను అనుకున్న దానికి కట్టుబడి రీటెండరింగ్ కే మొగ్గు చూపారు. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం పదే, పదే వద్దని హెచ్చరిస్తుంది.


ఇక పీపీఏల ఒప్పందం గురించి ఏకంగా కేంద్ర మంత్రి జగన్ కు లేఖ రాశారు. పీపీఏ ఒప్పందాల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయని .. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం గట్టిగానే స్పందిస్తుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఇవేమి పట్టించుకునే పరిస్థితిలో లేరు. నా రూటే సెపరేట్ అనే మాదిరిగా ఉంది. పోలవరం పనులు చేపడుతున్న నవయుగ కంపెనీని ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా రీటెండరింగ్ కు వెళ్లిన సంగతీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: