కోడెల ఆత్మహత్యకు సీఎం జగన్ కు ఎటువంటి సంభందం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు ఎందుకో గాని కోడెల ఆత్మహత్యను పొలిటికల్ మైలేజీ కోసం ఉపయోగించుకోవాలని .. అందులో జగన్ ను భాద్యుడిగా చేయాలనీ తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బాబు వెళ్లి గవర్నర్ ను కలిసినారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు అసలు పట్టించుకుకోవటం లేదు. పోనీ జగన్ పాలనా పట్ల అసంతృప్తితో ఉన్నారంటే అది లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డేట్ లు చెప్పి మరీ పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. దీనితో ప్రజల్లో అసంతృప్తి అనే మాటకు ఛాన్స్ లేదు.


అయితే ప్రతిపక్షాలు రాద్ధాంతం మాములే. టీడీపీ అధినేత చంద్రబాబు .. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ పసలేని వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవటం లేదు. వీళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజలు పట్టించుకోవటం లేదు. మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు. మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు.


రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు. ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. రాష్ట్రంలో   సీఎం ఒక్కరే బాగా పని చేస్తే సరిపోదు. మంత్రులు కూడా బాగా పని చేస్తేనే ప్రజల్లో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులు .. ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయిన చంద్ర బాబు పట్టించుకోని పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రుల పని తీరు బాగా ఉందని జగన్ కు నివేదిక వచ్చిందటా ! అయితే ఏపీ సీఎంగా జగన్ రాష్ట్రంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: