పూలను పూజిస్తూ... పూలను దేవతగా కొలిచి  బతుకమ్మ పండుగ జరుపుకునే గొప్ప సంస్కృతి మన తెలంగాణ ప్రజలది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ బతుకమ్మ పండగ  ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే ఇంకొన్ని రోజుల్లో బతుకమ్మ సందడి మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సిద్ధమైంది. ప్రతి తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ రోజు కొత్త చీర కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుంది.

 

అయితే ఈసారి బతుకమ్మ చీరల పంపిణీ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ బతుకమ్మ చీరల వల్ల మరమగ్గాల కార్మికులకు కూడా లబ్ధి చేకూరుతుంది.  ఒకప్పుడు పనులు లేక ఇబ్బందులు పడ్డ మరమ్మగ్గ  కార్మికులు బతుకమ్మ చీరల తయారీ కారణంగా నెలకు 16 నుండి 20 వేల రూపాయలను సంపాదించుకుంటున్నారు . కాగా 10 రకాల డిజైన్లు 10 రకాల రంగులు కలిపి 100 వెరైటీలుగా  ఈసారి చీరలను తయారు చేయించింది ప్రభుత్వం . దీనికోసం ప్రభుత్వం 313 కోట్లు ఖర్చు పెట్టింది. 18 సంవత్సరాల నిండి  తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కు బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది చీరలో నాణ్యతను పెంచింది  ప్రభుత్వం. కాగా కొన్ని జిల్లాలో ఇప్పటికే బతుకమ్మ చీరలు పంపిణీ కోసం పంపించగా... అక్కడి గ్రామ వాలంటీర్లు గ్రామ కమిటీలు ఈ చీరలను పంపిణీ చేస్తాయి.కాగా మొత్తంగా  ఇప్పటి వరకు బతుకమ్మ చీరల తయారీకి గాను 715 కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: