సెప్టెంబర్, 20 వ రోజుకు చరిత్రలో ప్రత్యేకమైన స్తానం ఉంది. ఈ రోజు జరుపుకునే పండుగలు, జాతీయ దినాలను ఒకేసారి పరిశీలిద్దాం. దేశ వ్యాప్తంగా నేడు రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక చరిత్రంలో ఇదే రోజు జన్మించిన వారిని ఒక సరి గుర్తు చేసుకొద్దాం. మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి  జహాంగీర్ జననం 1569 వ సంవత్సరంలో జరిగింది. ఆయన 1627 వ సంవత్సరంలో మరణించారు. ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు 1914 లో జన్మించారు. ఈయన 2003 లో మరణించారు. ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు 1924 లో పుట్టారు.




ఎఎంఆర్ గా తెలుగు సినీ అభిమానుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నటన రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అక్కినేని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సినీలోకం సంసిద్దమవుతుంది. ఇదిలా ఉండగా నాగేశ్వర రావు 2014 లో తుది శ్వాస విడిచారు. మరో ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 లో పుట్టారు. ధర్మవరం కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఈయన రాజకీయ రంగంలో కూడా రాణించారనే చెప్పాలి. ఈ క్రమంలో  ఆయన తెలుగు సాహిత్య అకాడమీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు.  హైదరాబాద్ లోని రవీంద్ర భారతి అభివృద్ధిలో కూడా సుబ్రహ్మణ్యం విశేషమైన సేవలను అందించారు. 2013 లో ఆయన కలం చేశారు. భారత పార్లమెంటు సభ్యుడు అన్నయ్యగారి సాయిప్రతాప్ 1944 లో జన్మించారు.





తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ 1956 జన్మించారు. ఇదే సందర్బంలో చరిత్ర పుటల్లో ఈ రోజు మరణించిన వారిని ఒకసారి స్మరించుకుంద్దాం. హోంరూల్ ఉద్యమ నేత అనీ బెసెంట్ 1933 సంవత్సరంలో మరణించారు. ఈయన 1847 లో జన్మించారు. తమిళ సినిమా నటి టి.ఆర్.రాజకుమారి 1999 లో మృతి చెందారు. ఆమె 1922 సంవత్సరంలో జన్మించారు. రాజకుమారి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈమె ఎన్ టిఆర్ , ఏఎంఆర్ వంటి ప్రముఖ నటుల సరసన నటించి ఆయా పాత్రలను రక్తి కట్టించారు.   ప్రముఖ కవి మరియు రచయిత ఛాయరాజ్ 2013 లో మరణించారు. ఈయన జననం  1948 లో జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: