ఏమిటో ఇంత చిన్న విషయాల మీద కూడా చంద్రబాబునాయుడు చాలా అడ్డుగోలుగా మాట్లాడేస్తున్నారు. సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుపై ట్వీట్లు పెట్టి వేధించారని చంద్రబాబు మండిపోతున్నారు. ఆ వేధింపులకు తట్టుకోలేకే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడనే అర్ధం వచ్చేట్లుగా ఈ టెక్నాలజీ పితామహుడు మాట్లాడేస్తున్నారు.

 

నిజంగా ట్వీట్లు పెట్టి వేధించినంత మాత్రానా ఆత్మహత్యలు చేసుకుంటారా ఎవరైనా ? అని కూడా చంద్రబాబు ఆలోచించటం లేదు. తాను ఏమి చెబితే దాన్నే అచ్చేసొదిలే ఎల్లో మీడియా ఉంది కదా అని చంద్రబాబు రెచ్చి  పోతున్నారు.  ట్వీట్ల వేధింపుల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్నది కరెక్టే అయితే ఈ పాటికి దేశంలో చాలామంది సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకుని ఉండాల్సిందే.

 

ఎవరిదాకానో ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డిపై ఎంత నీచంగా ట్వీట్లు పెట్టలేదు ?  జగన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ నీచమైన ట్వీట్లను టిడిపి అధికారిక ఎకౌంట్ లోనే పెట్టిన విషయం చంద్రబాబు మరచిపోయారా ? జగన్ పై పెడుతున్న తప్పుడు ట్వీట్లపై వైసిపి నేతలు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేయలేదు ?  జగన్ అండ్ కో పై తప్పుడు ట్వీట్లు పెట్టటానికే ఏకంగా పెద్ద టీమునే చంద్రబాబు, లోకేష్ ఏర్పాటు చేసుకోలేదా ?

 

సరే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తమపై వైసిపి వాళ్ళు తప్పుడు ట్వీట్లు పెడుతున్నారంటూ ఇదే చంద్రబాబు, లోకేష్ గగ్గోలు పెట్టేస్తున్నారు కదా . తప్పుడు ట్వీట్లు పెట్టి వేధిస్తున్నారనే కారణంతో చంద్రబాబు కానీ లోకేష్ కాని ఆత్మహత్యకు ప్రయత్నించకుండా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేసినట్లు ? చంద్రబాబు చెబుతున్నట్లు ట్వీట్లకో, కేసులకో భయపడి కోడెల ఆత్మహత్య చేసుకోలేదు.

 

పార్టీ పరంగా తనను చంద్రబాబు ఒంటరిని చేసినందుకు, తనతో తప్పుడు పనులు చేయించి నమ్మక ద్రోహం చేసినందుకు, కొడుకు, కూతురుతో జరిగిన గొడవలతో మనస్తాపానికి గురయ్యే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బహుశా ఈ కారణాలు నిజాలవుతాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: