చంద్రబాబునాయుడు తన స్ధాయిని తానే దిగాజర్చేసుకుంటున్నారా ? అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబు బాడీ లాంగ్వేజీ మొత్తం మారిపోయింది. తన మాయలను, ఎల్లోమీడియా రాతలను జనాలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటి కట్టబెట్టారు. దాంతో జగన్ పైనే కాకుండా చివరకు జనాలపైన కూడా మండిపోతున్నారు.

 

అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చలో ఆత్మకూరు పిలుపైనా, కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఉపయోగిస్తున్న భాషే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది.  తనను ఘోరంగా ఓడించారన్న మంట జగన్ పై బాగా పేరుకుపోయింది చంద్రబాబులో. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేసిన ఘటనలో కోడెలకు  చంద్రబాబు అడ్డంగా మద్దతిస్తున్నారు. విచిత్రమేమిటంటే బతికున్నపుడు కోడెలను దూరం పెట్టిన ఇదే చంద్రబాబు చనిపోయిన తర్వాత మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.

 

ఇక్కడ సమస్య ఏమిటంటే అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల వాడుకోవటం కన్నా కొడుకు శివరామకృష్ణ షోరూములో ఉపయోగించుకోవటమే కీలకమైంది. స్పీకర్ హోదాలో కోడెల ప్రభుత్వ ఫర్నీచర్ ను వాడుకోవటంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ఓడిపోయిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలి. అయితే తాను వాడుకోవటమే కాకుండా తన కొడుకు షోరూముకు కోడెల ఎలా తరలిస్తారు ? ఈ విషయాన్ని అడిగితే మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు.

 

ఎంతసేపు కోడెలపై 19 తప్పుడు కేసులు పెట్టారని, కుటుంబంపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అబద్ధపు ప్రచారాన్నే చేస్తున్నారు. కోడెలపై పెట్టింది ఒక్క కేసు మాత్రమే. కొడుకు, కూతురు అరాచకాలపై వచ్చిన ఫిర్యాదులతో వారిద్దరిపై చెరో 20 కేసులు నమోదయ్యాయి. వారిద్దరిపై ఫిర్యాదులు చేసిన వాళ్ళల్లో టిడిపి నేతలు కూడా ఉన్నారు కదా అంటే మళ్ళీ చంద్రబాబు మాట్లాడటం లేదు.


ఏదేమైనా జగన్ విషయంలో చంద్రబాబు ఉపయోగిస్తున్న భాషే చాలా అభ్యంతరంగా ఉంది. అయినా అదే భాషను చంద్రబాబు పదే పదే వాడుతున్నారంటేనే అర్ధమైపోతోంది జగన్ అంటే చంద్రబాబులో ఎంత కసి పేరుకుపోయిందో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: