దైర్యంగా బతకటమంటే ఏమిటో  చంద్రబాబునాయుడు చెప్పటమే విచిత్రంగా ఉంది. మీడియాతో పోలవరం ప్రాజెక్టు గురించి  మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారు భయపడుతు బతికితే భవిష్యత్తరాలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సుంటుందని చెప్పటమే విడ్డూరం.

 

సందర్భం లేకుండా ధైర్యం గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడారో ఎవరికీ అర్ధం కాలేదు. నిజానికి చంద్రబాబంత పిరికి వాడు లేరనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని కూడా సూటిగా చెప్పలేరు. ఏ నిర్ణయం కూడా వెంటనే తీసుకోలేరు. ఏ నేతపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు.

 

ఎవరితో డీల్ చేయాలన్నా దొడ్డి దోవే చంద్రబాబు రాజమార్గం. మీడియా ముందు మాత్రమే చంద్రబాబు హూంకరింపులు కనబడతాయి. మీడియాతో మాట్లాడుతున్నపుడు మాత్రం తీవ్ర హెచ్చరికలు చేసే చంద్రబాబు తర్వాత మాత్రం మామూలే. ఎంతసేపు నేతలు తమంతట తాముగా పార్టీ నుండి వెళిపోయే పరిస్ధితులు సృష్టించటమో లేకపోతే పరోక్షంగా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి కాళ్ళబేరానికి రప్పించుకుంటారన్న విషయం పార్టీలో అందరికీ తెలిసిందే.

 

బహుశా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం లేదని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండచ్చు.  ఏ విషయంలో జగన్ కు ధైర్యం లేదో మాత్రం చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను నెరవేర్చటంలో జగన్ బిజీగా ఉన్నారు. విద్యుత్ రంగంలో అవినీతి జరిగిందన్న అనుమానంతోనే పిపిఏల సమీక్షకు పూనుకున్నారు. కేంద్రం  ఈ విషయంలో ఎన్ని అభ్యంతరాలు చెప్పినా జగన్ లెక్క చేయలేదు.

 

ఇక పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై నిపుణుల కమిటి వేశారు. ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నారు.  ఈ నిర్ణయాన్ని కూడా కేంద్రం తప్పు పట్టినా జగన్ పట్టించుకోలేదు.  ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే  విషయంలో జగన్ ముందు చంద్రబాబు ఎందుకూ పనికిరారు. అలాంటి చంద్రబాబు కూడా ధైర్యం గురించి మాట్లాడుతున్నారంటే ధైర్యానికే సిగ్గు చేటు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: