2014 ఎన్నికలకు ముందు వరకు బాలకృష్ణ సినిమా రంగంలో బిజీగా ఉన్నారు. గతంలో రాజకీయాల గురించి అడిగితే తనకు పెద్దగా నచ్చవని చెప్పిన బాలయ్య 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా హిందూపురం నుంచి పోటీ  చేయాల్సి వచ్చింది.  హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  2014లో ఆ నియోజక వర్గానికి టిడిపి ప్రభుత్వం ఓ ఇంచార్జ్ ని నియమించింది.  ఆయనే అక్కడి పనులు చూసుకున్నారు.  బాలయ్య అప్పుడప్పుడు వెళ్లి ఫోటోలు దిగి వచ్చేవారు.  


అసెంబ్లీలో కూడా అప్పుడప్పుడు కనిపించేవారు.  పెద్దగా నియోజక వర్గానికి వెళ్లడం గాని.. అసెంబ్లీ నియోజక వర్గం గురించి చర్చించడంగాని చేయలేదు.  దీంతో 2019లో బాలయ్య గెలుస్తారా లేదా అనుకున్నారు.  అయితే, హిందూపురం నియోజక వర్గం మరోసారి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని నిరూపించింది.  రాష్ట్రం మొత్తం వైకాపా గాలి వీస్తున్నా.. హిందూపురంలో మాత్రం టిడిపి గాలి వీచింది.  టిడిపి విజయం సాధించింది.  


తెలిచిన తరువాత హిందూపురం ఒకటి రెండు సార్లు వెళ్లారు.  అలానే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రోజున కనిపించారు.  ఆ తరువాత బాలయ్య మరలా అసెంబ్లీలో కనిపించలేదు.  సినిమా బిజీలో మునిగిపోయాడు.  వరసగా సినిమాలు చేస్తున్నాడు.  ప్రస్తుతం సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా తరువాత బోయపాటితో ఉన్నది.  ఆ తరువాత పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నారు.  


ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటే... అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు.. హిందూపురం ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకుంటూ.. గతంలో అంటే టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఏదోవిధంగా చెల్లుబాటు అయ్యింది.  కానీ, ఇప్పుడు వైకాపా అధికారంలో ఉన్నది.  జగన్ తన దృష్టిని హిందూపురం నియోజక వర్గంపై పెట్టారు.  మరి అలాంటప్పుడు బాలయ్య నెలలో ఒక్కరోజైనా హిందూపురంలో ఉంటె బాగుంటుందేమో.  బాలయ్య ఈ విషయాలను పట్టించుకుంటరా.. లేదంటే గతంలో మాదిరిగానే చల్తాహైలే అంటారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: