నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ కేసు వ్యవహారం మరోసారి సంచలనం రేపుతోంది. వివాహం జరిగినప్పటినుండి సింధు శర్మ తన భర్త వశిష్టతో పాటు అత్తామామలు తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపణలు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ రాత్రి తన జీవితంలో ఒక కాల రాత్రి అని అంటూ చెప్పుకొచ్చింది బాధితురాలు సింధు శర్మ. ఆరోజు తనను తీవ్రంగా హింసించారని తెలిపింది. కొట్టరాని చోట్ల దారుణంగా కొట్టారని, బట్టలు కూడా చించివేశారని తన బాధను చెప్పుకొచ్చింది. 
 
ఆస్పత్రిలో జాయిన్ చేయమంటే మెంటల్ ఆస్పత్రికి పంపిస్తామని చితకబాదారని, ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా తనను కొట్టారని ఆరోపణలు చేసింది. భర్త వశిష్ట తనతో వస్తాడని భావించి మౌనంగా ఉన్నానని సింధు శర్మ చెప్పింది. చివరకు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. భర్తతో పాటు అత్త మామలపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసిన పోలీసులు రెండు సార్లు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. 
 
నాలుగు నెలల క్రితం తీవ్రంగా కొట్టటంతో గాయాలతో సింధు శర్మ ఆస్పత్రిలో చేరింది. తన నుండి పిల్లలను వేరు చేయాలని చూస్తున్నారని కూడా సింధు శర్మ ఆరోపణలు చేశారు. సింధు శర్మ అత్తామామలు కొడుతున్న వీడియోలను బయట పెట్టింది. తనను కొడుతున్నారని చెప్పినా ఎవరూ నమ్మకపోవటంతో సీసీ కెమెరా దృశ్యాలను బయటపెట్టాల్సి వచ్చిందని సింధుశర్మ చెప్పారు. 

నాంపల్లి కోర్టులో మాజీ న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు కొడుకు వశిష్ట పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య సింధు శర్మ నుండి విడాకులు ఇప్పించాలని తన పిల్లలను తన వద్దకు పంపించాలని పిటిషన్ లో వశిష్ట పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు కోర్టుకు హాజరు కావటం జరిగింది. 24వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని సింధు శర్మ తరపు లాయర్ కు కోర్టు సూచించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: