బీజేపీ నేత,  మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద్  పై గత కొంత కాలంగా  అత్యాచార ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే .కాగా  ఉత్తరప్రదేశ్ లో పలు  ఆశ్రమాలు విద్యాసంస్థలు బిజెపి నేత చిన్మయానంద్ కి  ఉన్నాయి. అయితే  ఆయన విద్యా సంస్థల్లో చదువుతున్న ఓ న్యాయ విద్యార్థిని తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై  అత్యాచార  ఆరోపణలు చేసింది ఓ యువతీ . ఈ మేరకు ఫేస్ బుక్ లో  ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది ఆ విద్యార్థిని. అయితే ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ  న్యాయ విద్యార్థిని. దీంతో సుప్రీం కోర్టు న్యాయస్థానం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణకు ఆదేశించింది. అయితే చిన్మయానంద్ ని పలుమార్లు  విచారించిన సిట్ అధికారులు.... ఇప్పటి వరకూ ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆమె తను ఆత్మహత్య చేసుకుంటే గాని పోలీసులు కేసు పెట్టారేమో అని వాపోయింది. ఈ నేపథ్యంలో అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 కాగా  ఒక ఒక కేంద్ర మాజీ మంత్రి స్థానంలో ఉండి... ఏదో ఆశ్రమాలు విద్యాసంస్థలు నడుపుతూ ఉండి ఒక విద్యార్థి పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించడం... అత్యాచారం చేయడం సిగ్గుచేటని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: