మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీయడం వలన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వానికి వ్యతిరేకత లేకపోయినా ప్రజలు కాస్త మార్పును కోరుకున్నారు.  అందుకే కాంగ్రెస్ కు పట్టంగట్టారు.  కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కొత్తగా చేస్తున్నది ఏమిలేదు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటె ఎలా చేస్తుందో అలానే చేస్తున్నది.  


అటు రాజస్తాన్ లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  కానీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య బేధం తక్కువగా ఉంది.  ఎప్పుడైనా ఏదైనా తేడా వస్తే.. బీజేపీ రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి రావొచ్చు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రపై కన్నేసింది.  మహాలో అధికారంలోకి రావాలని చూస్తున్నది.  ఇప్పటికే సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. 


కాంగ్రెస్ పార్టీ మహాలో ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది.  ఈ పొత్తులో భాగంగా ఎన్సీపీకి 125, కాంగ్రెస్ 123 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.  మిగతా స్థానాలను కలిసి నడిచే ఇతర పార్టీల కేటాయించారు.  అయితే, బీజేపీ, శివసేనల కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగానే సొంతంగా రెండు పార్టీలు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి.. రెండు కలిసి ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తాయి.  


కానీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నది.  ఎలాగైనా బలం పుంజుకొని మహారాష్ట్రలో జెండా పాతాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.  చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లకు తాళాలు వేశారు.  పార్టీ ఆఫీస్ లు నడిపేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమయంలో ఎన్నికలను ఎదుర్కోవాలంటే డబ్బు కావాలి.  ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తుందో మరి.  ఈసారి కూడా మహారాష్ట్రాలో బీజేపీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ ఇక మహారాష్ట్రపై ఆశలు వదిలేసుకోవడం ఉత్తమం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: