కాంగ్రెస్ లో  హుజూర్ నగర్ ఉప ఎన్నికపై నేతల మధ్య రగడ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టిపిసిసి చీప్ ఉత్తమ్ ... ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా పోటీ చేయడంతో అక్కడ ఆయన  కూడా గెలుపొందాడు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక జరగనుండగా హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ని  నిలబెట్టేందుకు ఉత్తమ్  నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 

 అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు నోటీసులు జారీ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. కోమటిరెడ్డి,  పీహెచ్,  జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ కి ఉత్తమ్  కి మద్దతుగా నిలిచారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కోర్ కమిటీ తో చర్చించినప్పుడు మాట్లాడని రేవంత్... ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు అని  ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీప్ లకు నోటీసులు ఇచ్చే ఆనవాయితీ లేదని... కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ కు  ఈ విషయాలు అర్థం కావడం లేదని విహెచ్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీ లో  చెలాయించినట్లు  కాంగ్రెస్ పార్టీ లో  దాదాగిరి చెల్లించాలని చూస్తే నడవదని విహెచ్ మండిపడ్డారు. ఇక ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి  రేవంత్ కి కౌంటర్ ఇవ్వగా... ఇప్పుడు విహెచ్ కూడా రేవంత్ తీరుపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: