ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా ఇలా ఒకటి కాదు అతనికి చాల పేర్లు ఉన్నాయి. అతను ఎవరో కాదు 'నారా లోకేష్'. అప్పుడప్పుడు ప్రజల మధ్య ఎప్పుడు ట్విట్టర్ లో కనిపించే ఈ ట్విట్టర్ పిట్టా ఈరోజు నెటిజన్లతో చివాట్లు తింటున్నాడు.                    


వర్ధంతికి.. జయంతికి తేడా తెలియని నువ్వు కూడా జగన్ అన్న గురించి మాట్లాడుతావు అంటూ ఘోరాతి ఘోరంగా నారా లోకేష్ ని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అని ఆలోచిస్తున్నారు కదా. అదేనండి.. నారా లోకేష్ అనర్గళంగా తెలుగులో మాట్లాడలేరు కానీ ట్విట్టర్ లో రాయగలరు. అలానే ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఘోరాతి ఘోరంగా మాట్లాడారు.                               


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశిస్తూ ''మిమ్మల్ని చూస్తే సిగ్గు కూడా సిగ్గు పడుతుంది' అంటూ ట్విట్ పెట్టారు లోకేష్. ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు.. తప్పులను చూపించచ్చు ముఖ్యమంత్రిపై అనుచితంగా మాట్లాడకూడదు అంటూ కామెంట్లు చేశారు. మరి కొందరు ఈ కామెంట్లపై స్పందిస్తూ ఏంటి లోకేష్ నువ్వు కూడా సిగ్గు గురించి మాట్లాడుతున్నావు.. నువ్వు మాట్లాడకు సిగ్గు గురించి.. చాలా ఛండాలంగా ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. మరి ఈ కామెంట్లపై లోకేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.                                                                   


మరింత సమాచారం తెలుసుకోండి: