కంచుకోటలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో కొట్టమిట్టాడుతోంది. ఘోర ఓటమి చవిచూసి మూడు నెలలు దాటిన నేతలు కంటికి కనిపించడం లేదు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ పరిస్థితులు అన్నీ కృష్ణా జిల్లా టీడీపీలో కొట్టచ్చినట్లు కనబడుతున్నాయి. ఎప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచే కృష్ణా జిల్లా...మొన్న ఎన్నికల్లో గట్టి షాక్ ఇవ్వడంతో కోలుకోలేకపోతుంది. ఈ ఓటమికి తోడు నేతలు..ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నడుస్తున్నారు.


అందులో కొందరు నేతలు..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ...ఇంకా పార్టీని భ్రష్టు పట్టిస్తుంటే...మరికొందరు గెలిచినప్పుడే పార్టీతో మనకు పని...ఓడినప్పుడు పార్టీతో పని ఏముందిలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. బుద్దా వెంకన్న, కేశినేని నాని, దేవినేని ఉమా లాంటి వాళ్ళు..పార్టీలో అంతర్యుద్ధానికి తెరలేపారు. మొన్నటివరకు వీరికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరిపోయింది. ఇక ఎప్పటిలాగే దేవినేని ఉమా జిల్లాలో ఆధిపత్యం చెలాయిద్దామని ప్రయత్నిస్తున్నారు.


అదే ఇప్పుడు కొందరు నేతలకు మండుతుంది. గతంలో లాగా ఉమాని లెక్క చేయట్లేదు. ఉమా వెనుక ఎవరు నడవడంలేదు. దీంతో ఉమా ఒక్కడే హడావిడి చేస్తున్నాడు. అటు గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్ లు తమ పని తాము చేసుకుంటున్నారు. ఇక ఓడిపోయిన నేతలు ఇప్పటికీ అడ్రెస్ లో లేరు. అటు సీనియర్ నేతలు సైలెంట్ గా సినిమా చూస్తున్నారు. అసలు ఏ ఒక్క నేత కూడా పార్టీని బలోపేతం చేయాలని చూడట్లేదు.


అలాగే ప్రజల వద్దకు వెళ్ళి ఇది సమస్య అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అటు అధినేత కూడా జిల్లా పార్టీని గాలికొదిలేసి...వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. మొత్తం పరిణామాలని చూస్తుంటే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ప్రజలకు దూరంగా ఉంటూ...వివాదాలకి దగ్గరగా ఉంటున్నారు. ఇలాగే కొనసాగితే కంచుకోటలో త్వరలో షట్టర్ క్లోజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: