ఈమధ్య దొంగతనాల బెడద చాలా ఎక్కువ అయిపోతుంది. సెల్ఫోన్లు,  వాహనాలు,  నగదు ఇలా అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడి అందినకాడికి దోచుకుని ఇల్లు గుల్ల  చేస్తుంటారు దొంగలు. అయితే ఎవరైనా దొంగ దొంగ తనం చేసేటప్పుడు ... సడన్గా పోలీసు వాహనం సైరన్  వినిపిస్తే గుండెలు జారిపోతాయి కదా. కానీ ఇక్కడ ఓ దొంగ చాలా ధైర్యం చేశాడు. ఏకంగా పోలీసు వాహనాన్ని మాయం చేస్తాడు.

 

జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో పోలీసులు ఒక దొంగని పట్టుకొని విచారణ కోసం ఐదు రోజుల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు... అయితే ఓ రోజు రాత్రి పోలీసులు ఏమరుపాటుగా ఉండటం గమనించిన ఆ దొంగా... సెల్ నుండి తప్పించుకుని ఏకంగా  పోలీసుల వాహనాన్ని దొంగిలించుకుని పారిపోయాడు. అయితే తెల్లారిన తర్వాత అటు దొంగ ఇటు తన వాహనం లేకపోవడంతో షాక్ కు గురైన  పోలీసులు  గుట్టుచప్పుడు కాకుండా దొంగను పట్టుకునే పనిలో పడ్డారట పోలీసులు. కాగా  ఎన్ని ప్రయత్నాలు చేసిన దొంగ ఆచూకీ లభించకపోవడంతో అయోమయంలో పడ్డారట పోలీసులు. కాగా  ఉండవెల్లి మండలం లోని తుక్కశీల  ప్రాంతంలో పోలీసు వాహనం ఉన్నట్లు సమాచారం తెలుసుకొని గుట్టుచప్పుడు కాకుండా వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారట పోలీస్ సార్లు  . అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు దీనిపై విచారణ  చేపట్టారట.

 

 

 పారిపోయిన దొంగ తెలకపల్లి మండలం గట్టు  నెల్లికుదురు గ్రామానికి చెందిన వాడు కాగా  హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రాంతంలో మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పోలీసుల మద్యం మత్తులో ఉండడం వల్ల దొంగ తప్పించుకుని పోలీసు వాహనం ఎత్తుకెళ్లాడని  పలువురు గుసగుసలాడుతున్నారు . పోలీసులు మాత్రం దొంగ  పారిపోయిన మాట వాస్తవమే కానీ... పోలీసులు వాహనం దొంగ ఎత్తుకెళ్లడానికి వస్తున్న పుకార్లు నిజం కాదని చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: