ఎన్నికల్లో ఓడిపోయినా సరే.. తమ కోసం కష్టపడినందుకు ఎల్లో మీడియా జర్నలిస్టులకు టీడీపీ కృతజ్ఞతలు తెలుపుకుందట. మళ్లీ ఐదేళ్ల పాటు పార్టీని బతికించేందుకు ఎల్లో మీడియాగా పేరున్న జర్నలిస్టులకు అమరావతిలో ఖరైదైన ఏరియాలో ఏకంగా 75 లక్షల విలువ చేసే ఫ్లాట్లు ఇచ్చిందట. దీనికి సంబంధించిన ఓ మెస్సేజ్ వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.


ఇంతకీ ఆ మెస్సేజ్ లో ముఖ్యమైన భాగాలు ఇలా ఉన్నాయి..

"పచ్చమీడియాగా ఇప్పటికే యల్లో షర్ట్ లు వేసుకున్న జాతి మీడియా రిపోర్టర్లకు తెలుగుదేశం పార్టీ చిన్న బాస్ ఇచ్చిన గిఫ్ట్ లు ఇప్పుడు మీడియా సర్కిల్‌లో దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి..పైకి బీసీల పార్టీలా బిల్డప్ లిచ్చే పచ్చపార్టీలో ఇన్నాళ్లు కొమ్ము కాసే కమ్మని‌వారికి‌ మాత్రమే 75 లక్షల విలువచేసే ఫ్లాట్ ఇచ్చి వారిని తమ ఇంట్లోనే సిండికేట్ బ్యాంకు గుర్తుల్లాగా కట్టేసుకున్నాడు చిన్న బాబు. 23 సీట్లతో చచ్చిపోయిందనుకున్న పచ్చ పార్టీ కు ప్రతి రోజు ఆక్సిజన్ ఇచ్చేందుకు ఇంట్లో కట్టేసుకున్న ఈ ఫ్లాట్ ఓనర్స్ తో డైలీ కవరేజ్ ప్లానింగ్ చేసుకుంది పచ్చ పార్టీ .


తాడేపల్లిలో ప్రధాన ప్రాంతమైన ఓ లగ్జరీ ఏరియాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మంది రిపోర్టర్ లలో ఐదుమందికి ఒక్కొక్కరికి 75 లక్షల విలువున్న ఫ్లాట్ ఇచ్చేయడంతో వారు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేసేసారు. అయితే తెలివి మీరిన ఇద్దరు రిపోర్టర్ లు వీరిలో ఒకరు ప్రతి క్షణం తమజాతి హితం కోసం‌ ప్రత్యక్ష ప్రసారాలు చేసే రిపోర్టర్ మాత్రం 75 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఖమ్మం‌లో భూములు కొన్నాడు. ఇంకో దమ్మున్న చానెల్ రిపోర్టర్ అంతే సొమ్ము తో గుంటూరు లో భూములు కొనుగోలు చేసాడు.


ఇక‌మెరుగైన సమాజం లో పనిచేసి ప్రస్తుతం చినబాబు కి ప్రత్యేక అధికారిగా వున్న మాజీ రిపోర్టర్ ఈ వ్యవహారాలను చక్కపెట్టడం లో కీలకపాత్ర పోషించాడు. అయితే మెరుగైన సమాజం కోసం పుట్టిన ఆ చానెల్ కి తెలుగు దేశం పార్టీ వ్యవహారాలు చూసే రిపోర్టర్ లేకపోతే ఈ ఫ్లాట్ బదులు ప్రస్తుతం ఆ చానెల్ లో సంస్థ వ్యవహారాలను చూస్తున్న పచ్చపార్టీ జాతి వారికి చినబాబు స్పెషల్ గిఫ్ట్ ను క్యాష్ రూపంలో చినబాబు స్పెషలాఫీసర్ అందజేయడం తో కేవలం ఆ జాతివారికే స్పెషల్ గిఫ్ట్ లు ఇప్పుడు అమరావతి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది."


మరింత సమాచారం తెలుసుకోండి: