రేవంత్ పెట్టిన మాటల చిచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. ఇదేదో చినికి చినికి గాలి వానలా మారుతోంది. వివాదానికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో తెలియడం లేదు. మరోవైపు హుజూర్ నగర్ అభ్యర్థి గా పార్టీలో పద్మావతికి మద్దతు పెరుగుతోంది.   


తెలంగాణ కాంగ్రెస్ లో హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపికపై రచ్చ కంటిన్యూ అవుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నల్గొండ జిల్లా నేతలు ఏకమయ్యారు. పార్టీలో రేవంత్ చాలా జూనియర్ అన్నారు వీహెచ్. హుజూర్ నగర్ అభ్యర్థిగా పద్మావతికి మద్దతు పలికారు. పీసీసీకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ అనొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపికపై కోర్ కమిటీలో చర్చ జరిగిందన్నారు వీహెచ్.


అటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూడా స్పందించారు. అఖిలపక్షానికి తనను, వంశీని పార్టీ పిలిచింది కాబట్టి వెళ్ళాం అన్నారు సంపత్. నాదెండ్ల మనోహర్  వెంటపడి... పిలిపించుకున్నది రేవంత్ రెడ్డే అని మండిపడ్డారు. సెల్ఫీలతో రాజకీయాలు చేసే వాళ్ళెవరో ప్రజలకు తెలుసన్నారు సంపత్. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ కు, యురేనియం సమస్యకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 


మొత్తానికి...కాంగ్రెస్ లో వార్ కొనసాగుతుంది. రోజుకొకరు స్పందిస్తూ.. ఇష్యూని పొడగిస్తున్నారు. ఈ చిచ్చు ఎప్పుడు అగుతుందో చూడాలి. ఈ పంచాయతీలో.. హుజూర్ నగర్ అభ్యర్థి గా పద్మావతికి మద్దతు బాగా పెరుగుతోంది. 
కాంగ్రెస్ లో ఎప్పటిలాగానే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీనియర్లు.. కొత్తగా వచ్చిన రేవంత్ ను జూనియర్ లా పరిగణిస్తున్నారు. నిన్నమొన్న వచ్చి పార్టీలో పెత్తనం చెలాయించేలా చూస్తున్నారంటూ కొందరు సీనియర్లు మండిపడుతున్నారు. అంతేకాదు ఏకంగా మీడియా ముందే తమ ఆరోపణలు గుప్పిస్తున్నారు. చూడాలి.. అసలు ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో.. 




మరింత సమాచారం తెలుసుకోండి: