బుద్ధి మార్చుకోకపోతే చర్యలు తప్పవని పాక్‌ను హెచ్చరించింది భారత్‌. గగనతలంలో మోడీ విమానానికి అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణసిస్తున్నట్టు తెలిపింది. నిర్ణయాన్ని మార్చుకోకపోతే అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. 


పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న దయాది దేశం... చివరికీ గగనతలంలోనూ  భారత విమానాలపై ఆంక్షలు విధిస్తోంది. తాజాగా మోడీ అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా... తమ గగనతలం నుంచి అనుమతించబోమని ప్రకటించింది. దీంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌ తన పాత అలవాట్లు మానుకోవడం లేదని, విదేశీ సంబంధాల విషయంలో పాక్‌ తన ధోరణి మార్చుకోవాలని భారత విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. లేదంటే అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.  


మొన్న కూడా ఇలానే వ్యవహరించింది పాక్. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌ విదేశీ పర్యటనకు..తమ గగనతలంలో అనుమతి ఇవ్వమని చెప్పింది. దీంతో అప్పటికప్పుడు రూట్‌ మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి పాక్‌ చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్‌. మరోవైపు... కాశ్మీర్‌ విషయంలో పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో గడువులోపు తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. మద్దతు కూడగట్టేందుకు కనీసం 16 దేశాల మద్దతు అవసరం. నిన్నటితో గడువు ముగియడంతో...  తీర్మానం ప్రవేశపెట్టలేకపోయింది పాక్. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ను ఒంటరి అయిపోతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తనకేదో ఇతర దేశాల నుంచి గట్టి మద్దతు ఉన్నట్టు బిల్డప్ ఇస్తోంది. కుక్కతోక వంకరలా తన బుద్ది మార్చుకోవడం లేదు.  తమ గగనతలంపై ఆంక్షలు విధించి విమర్శల పాలవుతోంది. అందుకే భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి పాక్ తోక ముడుస్తుందో లేక అలానే ప్రవర్తించి చావుదెబ్బ తింటుందో డాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: