గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమల ద్వారా వెదజల్లే కాలుష్యం అంతా ఇంతా కాదు.. ఈ పరిశ్రమలను అడ్డుకునేందుకు గతంలో ఎందరో పోలీసు లాఠీల దెబ్బలు తిన్నారు. కొందరు జైళ్లకు వెళ్లారు. కానీ ఈ కాలుష్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం జగన్ ఈ సమస్యపై దృష్టిసారించారు. పశుసంవర్ధక, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమస్యపై అధికారులతో చర్చించారు.


తూర్పుగోదావరి జిల్లాలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు... దీని వల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తోందని, ఈ అంశంపై పూర్తి అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. ఆక్వా కల్చర్‌ వల్ల ఆక్వా సాగు వల్ల తీవ్ర స్థాయిలో కాలుష్యం పెరుగుతోంది. కలుషితమై పర్యావరణం దెబ్బతింటోంది. ప్రస్తుతం ఏపీలో 4,58,679.48 ఎకరాల్లో చేపల సాగు ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అక్వా కల్చర్‌ సాగు వల్ల ఉత్పన్నమవుతోన్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంత సంతృప్తికరంగా లేవు.


ఆక్వా సాగు వల్ల పర్యావరణ, కాలుష్య సమస్యలతో పాటు ఇతర పంటలపై దాని ప్రభావం పడుతోంది. కోస్టల్‌ అక్వా కల్చర్‌ అథారికీ (సిఎఎ) నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 715ను తీసుకొచ్చింది. సిఎఎ నిబంధనల ప్రకారం వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్న భూముల్లో అక్వా కల్చర్‌ సాగుకు అనుమతించకూడదు. అక్వా కల్చర్‌ వల్ల సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది.


ఆక్వా సాగు వల్ల కలిగే దుష్పరిణామాలను అధ్యయనం చేసేందుకు గతంలోనూ నిపుణులకమిటీని నియమించినా ఫలితం లేదు. ఆక్వా సాగు వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందనే అంశాన్ని అనేక అధ్యయనాలు నిర్థరించాయి కూడా. మత్స్యకారులు కూడా దీని వల్ల నష్టపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: