ఇపుడున్న పరిస్థితుల్లో ఏ దేశం కూడా యుద్ధం కోరుకోదు.  ఒకవేళ యుద్ధం కోరుకుంటే జరిగే నష్టం ఏపాటిదో అందరికి తెలిసిందే.  అయితే, గల్ఫ్ లో మాత్రం ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.  రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి.  యెమన్ కు చెందిన హుతి తీవ్రవాదులు సౌదీ అరేబియాపై డ్రోన్ సహాయంతో అరాంకో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేశారు.  ఈ దాడులు ఇప్పటితో ఆగిపోవని కూడా స్పష్టం చేశారు. 


సౌదీ మాత్రం యెమన్ తీవ్రవాదులకు ఇరాన్ సహాయం చేసిందని, ఫలితంగానే వాళ్ళు సౌదిపై దాడులు చేశారని అంటోంది.  కానీ, ఇరాన్ మాత్రం తమకు సంబంధంలేని విషయాల్లో ఇరికిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్తోంది.  ఇక, సౌదీ అమెరికాకు మిత్ర దేశం.  ఇరాన్ కు శతృదేశం.  ఇరాన్  విషయంలో అమెరికాకూడా గుర్రుగా ఉన్నది.  ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవడమే దానికి కారణం.  


అయితే, అమెరికా నుంచి ఎక్కువుగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశంలో సౌదీ ఒకటి.  ఇష్టం వచ్చినట్టుగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.   ఇప్పుడు ఇరాన్ తో గొడవజరిగింది కాబట్టి అమెరికా తక్షణమే స్పందించింది.  ఇరాన్ ను హెచ్చరించింది.  అంతేకాదు, ఇరాన్ చుట్టూ పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను మోహరించింది.  నిత్యం డేగకళ్లతో కాపలా కాసే రాడార్ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థలు కలిగిన అమెరికా పహారాలో ఉన్న సౌదీపై ఒక చిన్న దేశానికీ చెందిన ఉగ్రవాదులు డ్రోన్ లతో ఎలా దాడి చేయడంతో రక్షణ లోపాలను బయటపడ్డాయి.  


పేట్రియాట్ వంటి అత్యంత బలమైన క్షిపణి వ్యవస్థపై అనుమానాలు తలెత్తుతున్నాయి.  పేట్రియాట్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆయుధంగా చెప్తున్నా.. చాలా దేశాలు మాత్రం రష్యా తయారు చేస్తున్న ఎస్400 క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం విశేషం.  ఈ క్షిపణులు పేట్రియాట్ కంటే శక్తివంతమైనవని అని రష్యా చెప్తున్నది.  గల్ఫ్ లోని చాలా దేశాలు వాటిని కొనుగోలు చేయడంతో అమెరికా భయపడుతున్నది.  ఒకవేళ యుద్ధమే వస్తే.. ఇరాన్ తన బలగాన్ని వైమానిక దళాన్ని సిద్ధం చేస్తే.. సౌదీ పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: