ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం మంచి ఫలితాల్ని ఇస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం 65వ ప్యాకేజీ పనులను శుక్రవారం రివర్స్ టెండరింగ్ లో మ్యాక్స్ ఇన్ ఫ్రా లిమిటెడ్ సంస్థ 15.6 శాతం తక్కువ ధరకు దక్కించుకుంది. ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వలన ప్రభుత్వానికి 274.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పనులలో 58.53 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. 
 
రివర్స్ టెండరింగ్ విధానంలో చేపట్టిన తొలి టెండర్ విజయవంతం కావటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవటంతో పాటు ప్రజలు, నిపుణులు జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రొక్యూర్ మెంట్ వెబ్ సైట్ వేదికగా పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం 65వ ప్యాకేజీ పనులకు 6 సంస్థలు బిడ్ లు దాఖలు చేశాయి. తక్కువ ధరకు కోట్ చేయటం వలన ప్రభుత్వానికి 42.78 కోట్ల రూపాయలు ఆదా అయింది. 
 
తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే 58.53 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయినట్లు లెక్క. రివర్స్ టెండరింగ్ విధానంలో చేపట్టిన తొలి టెండర్ సక్సెస్ కావటంతో పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రం పనులకు చేపట్టే రివర్స్ టెండరింగ్ విధానంలో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వ అధినేతలు పారదర్శకంగా వ్యవహరిస్తే ఏ స్థాయిలో ప్రజాధనం ఆదా అవుతుందో ఒక్క టెండర్ తోనే రుజువైందని వ్యాఖ్యలు చేశారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 60 సీ నిబంధన ద్వారా పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్ కే పనులు దక్కేలా నిబంధనలను రూపొందించటం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం నిపుణుల కమిటీని నియమించి సీఎం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ కు ఆదేశాలు ఇచ్చారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తొలి టెండర్ లోనే మంచి ఫలితాలను ఇవ్వటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: