ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పదేపదే ఢిల్లీ పర్యటనలు చేసేవారు.  ఢిల్లీలో వివిధ నాయకులతో నిత్యం టచ్ లో ఉండేవారు. మోడీ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన సమయంలో అయన ఢిల్లీతో నాయకులతో టచ్ లో ఉన్నారు.  అనంతరం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఆయన ఢిల్లీ వెళ్లారు.  ఎందుకంటే అప్పట్లో అయన కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది.  ఈ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ అనుసరించిన విధానాలే కావొచ్చు.. మరొకటి కావొచ్చు. 


ఇక్కడ ఏపీలో కూడా బాబుగారు దారులంగా ఓటమిలమియ్యరు.  దీంతో ఢిల్లీతో పని పడలేదు.  మూడు నెలలుగా అయన ఢిల్లీవైపు చూడలేదు.  అయితే, ఇప్పుడు బాబుగారికి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.  రాష్ట్రంలో వైకాపా పాలనా అరాచకంగా ఉందని,కోడెల వంటి నాయకులు ఆత్మహత్య చేసుకోవడానికి వైకాపా ఒత్తిడులు కారణం అని జాతీయ మీడియాతో చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు.  జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ వైకాపా గురించి చర్చించబోతున్నారు.  


త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఖరారు అవుతుందని తెలుస్తోంది.  ఒక్క జాతీయ మీడియానే కాకుండా, చంద్రబాబు నాయుడు అటు బీజేపీ నాయకులను ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షాను అలాగే కుదిరితే.. మోడీని కూడా కలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది తెలియాల్సి ఉన్నది. బాబు ఢిల్లీ పర్యటన గురించి త్వరలోనే విషయాలు బయటకు రాబోతున్నాయి.  


వైసీపీ బాధితుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తేవాలని భావిస్తున్నారు.చంద్రబాబు హస్తిన పర్యటన త్వరలోనే ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోడెల పై పెట్టిన కేసులు తదితర విషయాలపై అమిత్ షాతో మాట్లాడతారని సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.  నలుగురు సభ్యులు బీజేపీలోకి వెళ్లినా అయన ఏమి మాట్లాడలేదు.  దీంతో బీజేపీతో అయన ఇంకా సఖ్యతగానే ఉన్నారని బీజేపీ నాయకులు బాబుకు అనుకూలంగా మాట్లాడతారని అనుకుంటున్నారు.  ఏం జరుగుతుందో చూద్దాం.   


మరింత సమాచారం తెలుసుకోండి: