ఇన్నిరోజుల నుండి భయపెడుతున్న పసిడిధరలు ఒక్క సారిగా దిగివస్తున్నాయి.రాబోయేది పండగ సీజన్ కావడం,ధరలు దిగడం ఒకరకంగా అటూ వ్యాపారులకు,ఇటూ వినియోగదారులకు కలసివచ్చేదిగా చెప్పవచ్చు.ఎందుకంటే దసరా,దీపావళి పండగలకు కాస్త కనుగోల్లు పుంజుకుంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు.ఇక పసిడిప్రియులు కనుగోలు చేయడానికి ఆసక్తిని కూడా చూపిస్తారు.ఇక ఈ రోజు ఏ ధరలతో బంగారం పరిగెడుతుందో ఒక్క సారి చూద్దాం..



ఈరోజు దిగిన పుత్తడి ధరలు.ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం మార్నింగ్ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.04 శాతం తగ్గుదలతో రూ.37,670కు క్షీణించింది.ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,200 పడిపోయింది.పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. ధర రివర్స్ ట్రెండ‌లో నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.04 శాతం పెరుగుదలతో రూ.46,626కు చేరింది.వెండి ధర ఈ నెల ప్రారంభం లో రూ.51,489 గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే.



దీంతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ.4,900 పతనమైంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.పసిడి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,507.55 డాలర్లకు ఎగసింది.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నెల ఆరంభం లో 1,550 డాలర్ల గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఇందుకు కారణం. ఇక అదేసమయంలో బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. ఔన్స్‌‌కు 0.23 శాతం క్షీణతతో 17.83 డాలర్లకు తగ్గింది.భారత్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 20 శాతం మేర పెరిగాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం ఇందుకు కారణం. ధరల  పెరుగుదలతో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 60 శాతానికి పైగా తగ్గాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: