పెట్రోల్ ధరలు మళ్లి పెరిగాయి.కాగా వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.ఇప్పటికే సామాన్యుడు సరిగ్గా తిండితినలేని పరిస్ధితిలో జీవనాన్ని సాగిస్తున్నాడు ఎందుకంటే ఒక పెట్రోల్ పెరగడం వల్ల ఆ ప్రభావం అన్ని నిత్యావసర వస్తువులపై పడుతుంది.ఉన్న వాళ్లు ఆభారం మోయడానికి పెద్దగా ఆలోచించరు కాని మధ్యతరగతి వారు చాలా ఆలోచించి అడుగువేయవలసిన పరిస్ధితులు ఇప్పుడు మనముందుకు వస్తున్నాయి.ఏ సంక్షోభమైతే ఏంటి బాధలు అనుభవించేది మాత్రం సామాన్యుడే..



ఇక పెరిగిన దేశీ ఇంధన ధరల విషయానికి వస్తే,శనివారం కూడా పెట్రోల్,డీజిల్ ధరలు పైకి కదిలాయి.పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 26 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.77.97కు చేరింది.డీజిల్ ధర రూ.72.52కు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్,డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి.పెట్రోల్ ధర 29 పైసలు పెరుగుదలతో రూ.73.35 కు చేరింది.డీజిల్ ధర కూడా 24 పైసలు పెరుగుదలతో రూ.66.53కు ఎగసింది.వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది.పెట్రోల్ ధర 29 పైసలు పెరుగుదలతో రూ.79.02కు చేరింది.డీజిల్ ధర కూడా 25 పైసలు పెరుగుదలతో రూ.69.79కు ఎగసింది.



దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.ఎప్పుడూ దాదాపు 10 పైసలులోపు పెరుగుతూ తగ్గతూ వస్తున్న దేశీ ఇంధన ధరలు గత 4 రోజులుగా 30 పైసలు పెరగడం గమనార్హం.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి.బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.21 శాతం తగ్గుదలతో 63.20 డాలర్లకు క్షీణించింది.ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.17 శాతం తగ్గుదలతో 58.09 డాలర్లకు దిగొచ్చింది.ఈ ప్రభావం అన్ని రాష్ట్రాల పై పడటంతో పెట్రోల్,డిజిల్ ధరలకు రెక్కలోస్తున్నాయి.సామాన్య ప్రజలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: