చూడు సిద్దప్ప లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అని చెప్పినట్టుగా కర్ణాటక సిద్దప్ప.. సిద్దిరామయ్యపై కాంగ్రెస్ నేతలు పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు.  గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదోలా లాక్కొచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఆ తరువాత పంతం కోసం జేడీఎస్ తో చేతులు కలిపారు.  తరువాత జేడీఎస్ తో విభేదాలు వచ్చినా.. తప్పదు అన్నట్టుగా లాక్కొచ్చారు.  అధికారం కోల్పోవడంతో.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరే అనే విధంగా మారిపోయింది.  సిద్దిరామయ్య పార్టీ కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, సిద్దిరామయ్య హయంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.  


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, మల్లిఖార్జున ఖర్గేలకు అధిష్ఠానం దగ్గర మంచి పలుకుబడి ఉన్నా.. సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను కదిలించలేదు.  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరిని కలుపుకొనిపోయాడు.  అంతర్గతంగా విభేదాలు కనిపించినా.. బయటకు కనిపించకుండా లోపలే ఉంచేశారు.  ఎన్నికలు పూర్తయ్యి, సంకీర్ణం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొంత పట్టుసాధించిన సిద్దిరామయ్య.. ఆ తరువాత ఆ పట్టును నిలుపుకోలేకపోయారు.  


కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా సిద్దిరామయ్య వర్గంగా చెప్పుకున్న నేతలు కాంగ్రెస్ ను వదిలిపెట్టి బీజేపీలో చేరాలని చూడటంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.  ఈ విభేదాల కారణంగానే అధికారం కోల్పోయింది.  దీనికితోడు, ఈడీ కేసులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సతమతమౌతున్నారు.  ఇప్పటికే కొంతమంది నేతలు అధిష్ఠానం దగ్గర సిద్దప్ప గురించి కంప్లైంట్ చేశారట.  


సిద్దిరామయ్య అండర్ లో పనిచేయలేమని, ఆయన్ను మార్చకుంటే.. పార్టీ మనుగడ అసాధ్యం అని పార్టీని వదిలిపోవలసి వస్తుందని అంటున్నారు.  పార్టీ వదిలే బయటకు వచ్చే నాయకులకు, ఎమ్మెల్యేలకు బీజేపీ అక్కడ స్వగతం పలుకుతుంది.  ప్రభుత్వంలో పట్టు సాధించాలంటే ఇంకా బలగం కావాలి.  మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి.  ఈ సమయంలో ఇలాంటి తేడాలు వస్తే చాలా కష్టం అని అంటున్నారు నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: