కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 37వ జీఎస్టీ కౌన్సెల్ శుక్రవారం గోవాలో జరిగింది.ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల,కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు పాల్గొన్నారు.దేశ ఆర్థికమంద గమనం,జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకోగా ఈ సమావేశంలో వివిధ రంగాల జీఎస్టీ తగ్గింపు పైన చర్చ జరిపారు.ఈ చర్చలో ఆటో, టెలికం,ఎఫ్ఎంసీజీ,సహా అన్ని రంగాల జీఎస్టీ భారం తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. మొత్తానికి ఫైనల్ అయిన తర్వాత తేలిందేంటంటే హోటల్ రంగం వంటి కొన్ని మినహాయింపులు తప్ప పెద్దగా లబ్ధి ఉండక పోవచ్చునని,ఇదివరకే దేశీయకంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన మోడీసర్కార్.తాజాగా మరికొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించినట్లు తెలిపారు.



ఇందులో హోటల్ గదుల పై జీఎస్టీ పన్ను తగ్గింపు,వెట్ గ్రైండర్ల పై పన్నుతగ్గింపు,చింతపండు పై పన్ను మినహాయింపు, అలాగే రక్షణ ఉత్పత్తులపై పన్నుమినహాయింపు గడువు పొడగింపు తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి.భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు,సేవలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.అయితే సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు..ఇక జీఎస్టీ సేవల పరిదిలోకి వచ్చే వాటి వివరాలు క్లుప్తంగా పరిశీలిస్తే...



మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గింపు..చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేత..వెట్ గ్రైండర్ల పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గింపు.. దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు.. హోటల్ గది రూ.1000 లోపు అద్దె ఉండే హోటళ్లకు పూర్తిగా పన్ను మినహాయింపు..రూ.1000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 18 నుంచి 12 శాతం తగ్గింపు..రూ.7500 పైబడి అద్దె ఉండే హోటళ్లకు 28 నుంచి 18 శాతం జీఎస్టీ తగ్గింపు..ఔట్ డోర్ కేటరింగ్ పై విధించే జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతం తగ్గింపు..కెఫెన్ తో కూడిన బేవరేజస్ పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచినట్లు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: